తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష.. ‘‘కీ’’ ఇదిగో

By Siva KodatiFirst Published Aug 30, 2022, 7:42 PM IST
Highlights

పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ఆదివారం తెలంగాణలో ప్రాథమిక పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మంగళవారం ప్రభుత్వం ‘‘కీ’’ విడుదల చేసింది.

పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ఆదివారం తెలంగాణలో ప్రాథమిక పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మంగళవారం ప్రభుత్వం ‘‘కీ’’ విడుదల చేసింది. దీనిని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో వుంచినట్లు అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఏమైన అభ్యంతరాలు వున్న పక్షంలో తమను సంప్రదించాల్సిందిగా బోర్డ్ కోరింది. ఆగస్ట్ 31న ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపింది. 

ఇకపోతే..సివిల్ విభాగంలోని 15,644... ఎక్సైజ్ శాఖలో 614... రవాణా శాఖలో 63 కానిస్టేబుల్స్ పోస్టుల భర్తీ కోసం ఈ ఆదివారం తెలంగాణలోని 1601 కేంద్రాల్లో ప్రాథమిక పరీక్ష నిర్వహించారు. మొత్తం 6,03,955 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరయ్యారు. 

click me!