
వికారాబాద్ జిల్లా (vikarabad forest) పూడూర్‌లో కాల్పుల కలకలం రేగింది. పూడూర్ అడవుల్లో గురువారం కాల్పులు (gun firing) చోటు చేసుకున్నాయి. మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జరిగినట్లు గుర్తించారు. కాల్పుల శబ్ధం విన్న స్థానికులు దీనికి కారణమైన వారిని పట్టుకునేందుకు అడవిలోకి వెళ్లారు. అయితే ఈ కాల్పులు వేటగాళ్ల పనే అంటున్నారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.