తెలంగాణలో కరోనా దూకుడు.. 24 గంటల్లో 2,606 కేసులు, జీహెచ్ఎంసీలో విజృంభణ

By Siva Kodati  |  First Published Jan 8, 2022, 8:58 PM IST

తెలంగాణలో (telangana corona cases) కరోనా దూకుడు కొనసాగుతోంది. రోజు రోజుకు కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 73,156 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,606 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 


తెలంగాణలో (telangana corona cases) కరోనా దూకుడు కొనసాగుతోంది. రోజు రోజుకు కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 73,156 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,606 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,92,357కి చేరుకుంది. కోవిడ్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్ వల్ల (corona deaths in telangana) మరణించిన వారి సంఖ్య 4,041కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 285 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 12,180 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1583 కేసులు నమోదయ్యాయి.   

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 16, జీహెచ్ఎంసీ 1583, జగిత్యాల 8, జనగామ 1, జయశంకర్ భూపాలపల్లి 2, గద్వాల 6, కామారెడ్డి 11, కరీంనగర్ 27, ఖమ్మం 41, మహబూబ్‌నగర్ 22, ఆసిఫాబాద్ 6, మహబూబాబాద్ 53, మంచిర్యాల 38, మెదక్ 8, మేడ్చల్ మల్కాజిగిరి 292, ములుగు 0, నాగర్ కర్నూల్ 19, నల్గగొండ 16, నారాయణపేట 1, నిర్మల్ 1, నిజామాబాద్ 35, పెద్దపల్లి 19, సిరిసిల్ల 7, రంగారెడ్డి 214, సిద్దిపేట 16, సంగారెడ్డి 59, సూర్యాపేట 13, వికారాబాద్ 8, వనపర్తి 9, వరంగల్ రూరల్ 6, హనుమకొండ 45, యాదాద్రి భువనగిరిలో 18 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Latest Videos

undefined

మరోవైపు దేశంలో ఒక్క రోజులోనే ఏకంగా దాదాపు ల‌క్ష‌న్న‌ర మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. Covid-19 మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారి  థ‌ర్డ్ వేవ్ భ‌యం ప్ర‌జ‌లు మ‌రింత‌గా ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌తి. గ‌త 24 గంట‌ల్లో దేశవ్యాప్తంగా  కొత్త‌గా 1,41,986 కేసులు నమోదయ్యాయి.  

ఇది ఏడు నెల‌ల గ‌రిష్టం. కేవలం ఎనిమిది రోజుల్లోనే Covid-19  మహమ్మారి ఏడు నెలల రికార్డును బ్రేక్ చేసింది. దేశంలో ఏడు నెలల తర్వాత రోజువారి Coronavirus కేసులు మ‌ళ్లీ లక్ష మార్క్‌ దాటి పరుగులు పెడుతున్నాయి. కేవలం తొమ్మిది రోజుల్లోనే డైలీ కేసుల సంఖ్య పదివేల నుంచి లక్ష మార్క్ దాటి.. లక్షన్నరకు  చేరువైంది.  అలాగే, గ‌త 24 గంట‌ల్లో క‌రోనా మహమ్మారి కారణంగా 285 మంది ప్రాణాలు కోల్పోయార‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా మహమ్మారితో 4,83,178 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం క‌రోనా బారిన‌ప‌డ్డ‌వారి సంఖ్య 3,53,68,372కు చేరింది. యాక్టివ్ కేసులు సైతం గ‌ణ‌నీయంగా పెరిగాయి. ఏకంగా నాలుగు ల‌క్ష‌ల‌కు పైగా పెరిగాయి. ప్ర‌స్తుతం దేశంలో 4,72,169 క్రియాశీల కేసులు ఉన్నాయి. 

ఇదే స‌మ‌యంలో కరోనా నుంచి 40,895 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి Covid-19 నుంచి రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 3,44,12,740 కి చేరింది. కొత్త‌గా న‌మోదైన Coronavirus కేసుల్లో అత్య‌ధికం మ‌హారాష్ట్రలోనే న‌మోద‌య్యాయి. నిన్న ఒక్క‌రోజే 40,925 క‌రోనా కేసులు అక్క‌డ న‌మోద‌య్యాయి. అలాగే, 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మ‌హారాష్ట్రలో ఇప్ప‌టివ‌ర‌కు 68,34,222 క‌రోనా కేసులు, 1,41,614 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. 

 

Media Bulletin on status of positive cases in Telangana.
(Dated.08.01.2022 at 5.30pm) pic.twitter.com/C1uP9UwpcG

— IPRDepartment (@IPRTelangana)
click me!