నిమ్స్‌లో కరోనా కలకలం: 26 మంది డాక్టర్లు, 40 మంది వైద్య సిబ్బందికి కోవిడ్

By narsimha lodeFirst Published Jun 17, 2020, 5:41 PM IST
Highlights

హైద్రాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపుతోంది.  66 మందికి కరోనా సోకింది. వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా సోకింది.నిమ్స్ ఆసుపత్రిలో 26 మంది వైద్యులకు , 40 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. కరోనా సోకిన వ్యైదులు, వైద్య సిబ్బందిని క్వారంటైన్ కి తరలించారు.

హైదరాబాద్: హైద్రాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపుతోంది.  66 మందికి కరోనా సోకింది. వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా సోకింది.నిమ్స్ ఆసుపత్రిలో 26 మంది వైద్యులకు , 40 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. కరోనా సోకిన వ్యైదులు, వైద్య సిబ్బందిని క్వారంటైన్ కి తరలించారు.

తెలంగాణలో రోజు రోజుకు వైద్యులు కరోనా బారిన పడడంపై ఆందోళన వ్యక్తమౌతోంది. గత వారం రోజుల క్రితం కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండ్ కు కరోనా సోకింది.

also read:కరోనా కలకలం: పేట్లబురుజు ఆసుపత్రిలో 32 మందికి కరోనా

ఈ నెల 15వ తేదీన పేట్ల బురుజు ఆసుపత్రిలో 14 మంది డాక్టర్లు, 18 మంది వైద్య సిబ్బంది కరోనా బారినపడ్డారు.పేట్లబురుజు ఆసుపత్రి తర్వాత నిమ్స్ ఆసుపత్రిలో అతి పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్యసిబ్బంది కరోనా బారిన పడింది నిమ్స్ ఆసుపత్రిలోనే.

మంగళవారం నాటికి తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు 5,406కి చేరుకొన్నాయి. మంగళవారం నాడు కరోనా కేసులు 213 నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 165 కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తెలుస్తోంది.

.జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల్లోని 50 వేల మందికి కరోనా పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నెల 16వ తేదీ నుండి ఈ పరీక్షలను ప్రారంభించింది ప్రభుత్వం. అంతేకాదు ప్రైవేట్ ల్యాబ్ లలో కూడ కరోనా పరీక్షలను నిర్వహించనున్నారు. 

click me!