తెలంగాణ: 300 దిగువకు పడిపోయిన రోజువారీ కరోనా కేసులు.. జీహెచ్‌ఎంసీలో తీవ్రత

Siva Kodati |  
Published : Aug 29, 2021, 09:31 PM IST
తెలంగాణ: 300 దిగువకు పడిపోయిన రోజువారీ కరోనా కేసులు.. జీహెచ్‌ఎంసీలో తీవ్రత

సారాంశం

తెలంగాణలో కొత్తగా 257 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు మృతి చెందారు. 409 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 5,912 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో కరోనా నెమ్మదించింది. కొత్త కేసులు 300కి లోపే నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 58,335 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 257 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 87 కేసులు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 409 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,57,376 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,47,594 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,912 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 3,870కి పెరిగింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 4, జీహెచ్ఎంసీ 87, జగిత్యాల 4, జనగామ 8, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 1, కామారెడ్డి 0, కరీంనగర్ 16, ఖమ్మం 18, మహబూబ్‌నగర్ 5, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 6, మంచిర్యాల 4, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 9, ములుగు 4, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 6, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 3, పెద్దపల్లి 5, సిరిసిల్ల 5, రంగారెడ్డి 18, సిద్దిపేట 5, సంగారెడ్డి 7, సూర్యాపేట 11, వికారాబాద్ 1, వనపర్తి 2, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 18, యాదాద్రి భువనగిరిలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.

 

PREV
click me!

Recommended Stories

Mangli: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు మద్యం తాగి వచ్చిన న్యాయవాది సుబ్బారావు | Asianet News Telugu
Holiday : ఈ ఒక్కరోజే స్కూళ్లు, ఆఫీసులు.. మీకు ఈ మెసేజ్ వచ్చిందో మళ్లీ సెలవే..!