చదువుకున్నోళ్లందరికీ గవర్నమెంట్ జాబ్ రాదు: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Aug 29, 2021, 09:11 PM IST
చదువుకున్నోళ్లందరికీ గవర్నమెంట్ జాబ్ రాదు: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

సారాంశం

చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఎలా అంటూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కోటి ఉద్యోగాలున్నాయని.. కోటి ఉద్యోగాలు ఇవ్వగలమా అంటూ ఆయన ప్రశ్నించారు

మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో కోటి ఉద్యోగాలున్నాయని.. కోటి ఉద్యోగాలు ఇవ్వగలమా అంటూ ఆయన ప్రశ్నించారు. మొత్తం జనాభాలో కేవలం ఒక్క శాతం మాత్రమే ఇవ్వగలమని లక్ష్మారెడ్డి అన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. 

ALso Read:చదువుకున్నోళ్లందరికీ సర్కారీ నౌకరీ రాదు: మంత్రి నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

కాగా, కొద్దిరోజుల క్రితం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. చదువుకున్నోళ్లందరికీ ప్రభుత్వ ఉద్యోగం రాదంటూ వ్యాఖ్యానించారు. నాగర్‌కర్నూల్ జరిగిన ఓ సమీక్షా సమావేశంలో పాల్గొన్న నిరంజన్ రెడ్డి.. కొనుగోలు కేంద్రాల వద్ద చేసే హమాలీ పని ఉపాధి కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో హమాలీ పని కంటే మించిన ఉపాధి ఏముందని కామెంట్ చేశారు నిరంజన్ రెడ్డి. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్
చైనా మంజాను ఎలా త‌యారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రాణాలు పోయేంత ప్ర‌మాదం ఎందుకు.?