తెలంగాణ: భారీగా పడిపోయిన కొత్త కేసులు.. 24 గంటల్లో 231 మందికి పాజిటివ్, హైదరాబాద్‌లో అత్యధికం

Siva Kodati |  
Published : Aug 22, 2021, 09:08 PM ISTUpdated : Aug 22, 2021, 09:09 PM IST
తెలంగాణ: భారీగా పడిపోయిన కొత్త కేసులు.. 24 గంటల్లో 231 మందికి పాజిటివ్, హైదరాబాద్‌లో అత్యధికం

సారాంశం

తెలంగాణలో కొత్తగా 231 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతి చెందారు. 453 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 6,384 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మరోసారి భారీగా పడిపోయాయి. గడచిన 24 గంటల్లో 46,987 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 231 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 66 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 22 కేసులు గుర్తించారు. వికారాబాద్, నాగర్ కర్నూల్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో కోవిడ్ నుంచి 453 కోలుకోగా, ఇద్దరు మరణించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,54,989కి చేరింది. నిన్న కోలుకున్న వారితో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో 6,44,747 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,384 మంది చికిత్స పొందుతున్నారు. అటు తాజా మరణాలతో కలిపి తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 3,858కి చేరుకుంది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 5, జీహెచ్ఎంసీ 66, జగిత్యాల 5, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 2, గద్వాల 2, కామారెడ్డి 0, కరీంనగర్ 22, ఖమ్మం 6, మహబూబ్‌నగర్ 9, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 2, మంచిర్యాల 2, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 9, ములుగు 3, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 14, నారాయణపేట 1, నిర్మల్ 1, నిజామాబాద్ 5, పెద్దపల్లి 6, సిరిసిల్ల 6, రంగారెడ్డి 19, సిద్దిపేట 6, సంగారెడ్డి 2, సూర్యాపేట 13, వికారాబాద్ 0, వనపర్తి 1, వరంగల్ రూరల్ 9, వరంగల్ అర్బన్ 8, యాదాద్రి భువనగిరిలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

PREV
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో హై అలర్ట్.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana