ఈ చిన్నారి బాల భీముడు .. 20 నెలలవయసులోనే 5 కిలోల బరువెత్తి రికార్డ్... (వీడియో)

By AN TeluguFirst Published Aug 5, 2021, 10:28 AM IST
Highlights

ఈ ఏడాది సమ్మర్లో  4.2 కేజీల బరువున్న వాటర్ మిలన్ 17 నెలల వయసులో ఎత్తింది. ఇప్పుడు 20 నెలల వయసులో ఐదు కేజీల బరువు ఎత్తడం ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. 

ఓ హైదరాబాద్ చిన్నారి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఇంతకీ ఆ చిన్నారి వయసెంతో తెలుసా. 20 నెలలు మాత్రమే. బాల భీముడిగా ఆ చిన్నారి 5 కిలోల బరువు ఎత్తి రికార్డ్  సాధించింది.

"

హైదరాబాదులో నివాసం ఉండే సందీప్ కూతురు దాసరి సాయి అలంకృత 5 కిలోల బరువు ఎత్తి రికార్డు సృష్టించింది. చిన్నప్పటి నుంచి ఇంట్లోని వస్తువులను అవలీలగా ఎత్తి అందర్నీ అబ్బురపరుస్తోంది అలంకృత.

దీంతో అతి చిన్న వయసులో ఎక్కువ బరువు ఎత్తిన బేబీగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకుంది.  ఏడాది వయసు ఉన్నప్పుడే ఇంట్లో ఉన్న టూ లీటర్ వాటర్ బాటిల్ ను సాయి అలంకృత అవలీలగా ఎత్తుకుని నడిచింది. అప్పటి నుంచి చిన్నారిలోని స్పెషల్ టాలెంట్ ను తల్లిదండ్రులు గమనిస్తూ ప్రోత్సహిస్తున్నారు.

ఈ ఏడాది సమ్మర్లో  4.2 కేజీల బరువున్న వాటర్ మిలన్ 17 నెలల వయసులో ఎత్తింది. ఇప్పుడు 20 నెలల వయసులో ఐదు కేజీల బరువు ఎత్తడం ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. 
 

click me!