కరీంనగర్‌ జిల్లాలో బాలుడి కిడ్నాప్ కలకలం .. రెండేళ్ల చిన్నారిని బ్యాగ్‌లో కుక్కి, ఆటోలో వెళ్తుండగా

Siva Kodati |  
Published : Apr 27, 2023, 09:33 PM IST
కరీంనగర్‌ జిల్లాలో బాలుడి కిడ్నాప్ కలకలం .. రెండేళ్ల చిన్నారిని బ్యాగ్‌లో కుక్కి, ఆటోలో వెళ్తుండగా

సారాంశం

కరీంనగర్ జిల్లాలో బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది.  అయితే స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తం కావడంతో చిన్నారి క్షేమంగా బయటపడ్డాడు. 

కరీంనగర్ జిల్లాలో బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. రామడుగుకు చెందిన వానరాశి వెంకటేశ్ చిన్న కుమారుడు రెండేళ్ల రాంప్రసాద్ ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం అదే గ్రామానికి చెందిన మహిళ చిన్నారిని కిడ్నాప్ చేసింది. బాబు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. ఈ క్రమంలో ఓ మహిళ చిన్నారిని కిడ్నాప్ చేసి ఆటోలో వెళ్తోందని స్థానికుడొకడు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటాడారు.  ఎట్టకేలకు గ్రామంలోని రైల్వేగేట్ వద్ద ఆ మహిళను అడ్డుకుని నిలదీశారు. అంతకుముందే నిందితురాలి వద్ద వున్న బ్యాగ్‌లో చిన్నారి ఏడుపు వినపడటంతో తోటి ప్రయాణీకులకు అనుమానం వచ్చింది. దీంతో అంతా కలిసి ఆమెను పోలీసులకు అప్పగించి.. చిన్నారిని విడిపించారు. 


 

PREV
click me!

Recommended Stories

Jobs: ఇక‌పై తెలంగాణ యువ‌త‌కు జ‌పాన్‌లో ఉద్యోగాలు.. ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం
Kavitha: పెళ్లి కూతురుకు తాళి క‌ట్టిన క‌విత‌.. అస‌లేం జ‌రిగిందంటే.?