భర్తతో విభేదాలు, లవర్‌తో జంప్: ఏడాదిన్నర చిన్నారిని చంపిన ప్రియుడు

Published : Apr 01, 2021, 07:14 AM IST
భర్తతో విభేదాలు, లవర్‌తో జంప్: ఏడాదిన్నర చిన్నారిని చంపిన ప్రియుడు

సారాంశం

వివాహేతర సంబంధం ఏడాదిన్నర బాలుడి పాలిట శాపంగా మారింది. ప్రియురాలి ఏడాదిన్నర కొడుకును చంపిన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.  

హైదరాబాద్: వివాహేతర సంబంధం ఏడాదిన్నర బాలుడి పాలిట శాపంగా మారింది. ప్రియురాలి ఏడాదిన్నర కొడుకును చంపిన ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్ బోరబండలో ఉండే అజయ్ లాల్, బర్మా మౌనికలు 2018లో ప్రేమ వివాహం చేసుకొన్నారు.  వీరికి ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు.  అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో కొడుకును తీసుకొని మౌనిక పుట్టింటికి వెళ్లింది.

వాషింగ్ మెషీన్ల మెకానిక్  మద్దికుంట రాజుతో మౌనికకు ఏర్పడిన పరిచయం  వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో  వీరిద్దరూ దిల్‌సుఖ్ నగర్ కోదండరామ్ నగర్ లో ఓ ఇల్లును అద్దెకు తీసుకొని  సహజీవనం సాగిస్తున్నారు.

అయితే తన కొడుకు కోసం అజయ్‌లాల్  భార్య మౌనికకు ఫో చేస్తే  ఆమె నుండి సరైన సమాచారం రాలేదు. వీడియో కాల్ చేసినా కూడ  ఆమె కొడుకు కన్పించకుండా దాచిపెట్టేది.  ఈ ఏడాది ఫిబ్రవరి 28న భర్తకు ఫోన్ చేసి బాబుకు ఫిట్స్ వచ్చి చనిపోయాడని చెప్పింది.

ఈ విషయమై అనుమానంతో భర్త అజయ్ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. ఈ కేసును సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ను బదిలీ చేసింది. మౌనిక ఇంట్లో లేని సమయంలో చిన్నారిని ఛాతీపై బలంగా కొట్టి చంపాడని రాజు పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడు.
 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu