హైద్రాబాద్‌లో స్కూల్ గోడ కూలి ఇద్దరు విద్యార్థుల మృతి: నలుగురికి గాయాలు

Published : Aug 02, 2018, 04:14 PM ISTUpdated : Aug 02, 2018, 04:37 PM IST
హైద్రాబాద్‌లో స్కూల్ గోడ కూలి ఇద్దరు విద్యార్థుల మృతి: నలుగురికి గాయాలు

సారాంశం

కూకట్‌పల్లి న్యూ సెంచరీ స్కూల్లో  షెడ్డు కూలి  ఇద్దరు విద్యార్ధులు మృతి చెందారు. మరో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్ న్యూ సెంచరీ స్కూల్ విద్యార్థులుగా గుర్తించారు.


హైదరాబాద్: కూకట్‌పల్లి న్యూ సెంచరీ స్కూల్లో  షెడ్డు కూలి  ఇద్దరు విద్యార్ధులు మృతి చెందారు. మరో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్ న్యూ సెంచరీ స్కూల్ విద్యార్థులుగా గుర్తించారు.

కూకట్‌పల్లి న్యూ సెంచరీ స్కూల్‌ ముగిసిన తర్వాత సమీపంలోని ఓ షెడ్డులో విద్యార్థులకు కరాటే నిర్వహిస్తున్నారు. ఈ షెడ్డు ఇప్పటికే శిథిలావస్తకు చేరుకొంది.  అయితే కరాటే క్లాస్‌లో విద్యార్థులు కరాటే నేర్చుకొంటుండగా ఒకేసారి షెడ్ కుప్పకూలిపోయింది. ఈ షెడ్‌కు సంబంధించిన గోడ కింద పడి విద్యార్థులు మృత్యువాత పడ్డారు. 

ఈ స్లాబ్ కుప్పకూలిపోగానే  ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనలో అక్కడికక్కడే మణికీర్తన, చందన మృతి చెందారు. ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. 

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్