వారం రోజులుగా మంచం మీదనే మృతదేహం.. కుళ్లిపోయి, పురుగులు పట్టి...

By SumaBala Bukka  |  First Published Dec 20, 2023, 12:47 PM IST

రాధతో పాటు ఆ ఇంట్లో తల్లి, సోదరుడు పవన్ ఉంటారు. రాధ చనిపోయి నాలుగు రోజులకు పైనే అయ్యిందని సమాచారం. 
 


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. జీడిమెట్ల చింతల్ ఏరియాలో ఓ ఇంట్లో వారం రోజులుగా ఇంట్లోనే మృతదేహాన్ని పెట్టుకున్నారు కుటుంబసభ్యులు. దుర్వాసన భరించలేక స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బెడ్ మీద మృతదేహం ఉండడాన్ని గమనించారు.

మొదట పోలీసులు వచ్చినా తలుపులు తీయలేదు. దీంతో వారు తలుపులు బలవంతంగా తెరవడంతో వెలుగులోకి అసలు విషయం వచ్చింది.మృతురాలి పేరు రాధగా తెలిసింది. కుటుంబ సభ్యులకు మతిస్థిమితం సరిగా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Latest Videos

పోలీసులు అంబులెన్స్ తో వచ్చేసరికి మృతదేహం కుళ్లిపోయి, పురుగులు పట్టి, విపరీతంగా దుర్వాసన వేస్తూ కనిపించింది. వెంటనే మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రాధతో పాటు ఆ ఇంట్లో తల్లి, సోదరుడు పవన్ ఉంటారు. రాధ చనిపోయి నాలుగు రోజులకు పైనే అయ్యిందని సమాచారం. 

అయితే, ఆమె అనారోగ్యంతో ఉందని, కొంచెం తినమన్నా తినలేదని.. అలా చనిపోయి ఉంటుందని రాధ అన్న పవన్ చెబతున్నాడు. చనిపోయిన విషయం ఆయనకు అర్థం అయ్యిందో, లేదో తెలియని పరిస్థితి. ఈ విషయం స్థానికంగా సంచలనంగా మారింది. 

click me!