బాలిక స్నానం చేస్తుండగా వీడియో తీసిన హాస్పిటల్ క్లీనర్.. అరెస్ట్..!

Published : Mar 02, 2022, 10:28 AM IST
బాలిక స్నానం చేస్తుండగా వీడియో తీసిన హాస్పిటల్ క్లీనర్.. అరెస్ట్..!

సారాంశం

పోలీసులు నిందితుడు రామగిరి అరవింద్ గా గుర్తించారు. ఇతను మానకొండూరు మండలం ఉట్టూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అను కరీంనగర్ లోని రీనీ ప్రైవేట్ హాస్పిటల్ లో క్లీనర్ గా పనిచేస్తున్నాడు.

బాలిక స్నానం చేస్తుండగా... ఓ హాస్పిటల్ లో పనిచేసే క్లీనర్ వీడియో తీశాడు. కాగా... ఈ విషయం పై బాలిక ఫిర్యాదు చేయడంతో...  సదరు క్లీనర్ ని అరెస్టు చేశారు. ఈ సంఘటన కరీంనగర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కాగా... పోలీసులు నిందితుడు రామగిరి అరవింద్ గా గుర్తించారు. ఇతను మానకొండూరు మండలం ఉట్టూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అను కరీంనగర్ లోని రీనీ ప్రైవేట్ హాస్పిటల్ లో క్లీనర్ గా పనిచేస్తున్నాడు.

కాగా.. కొద్ది రోజుల క్రితం రమేష్ అనే వ్యక్తిని అతని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. రమేష్ భార్య, కూతురు  కూడా అతనితోపాటే ఆస్పత్రిలో ఉంటున్నారు. ఈ క్రమంలో  రమేష్ కుమార్తె పై అక్కడ క్లీనర్ గా పనిచేసే రామగిరి అరవింద్ కన్ను పడింది. బాలిక ఆస్పత్రిలోని బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా... సీక్రెట్ గా అరవింద్ వీడియో తీశాడు. దానిని గమనించిన బాలిక గట్టిగా అరిచింది. దీంతో.. అక్కడ ఉన్నవారు వెంటనే.. నిందితుడు అరవింద్ ని సెల్ ఫోన్ తో సహా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఆ తర్వాత బాధిత బాలిక తల్లి.. ఈ విషయమై ఆస్పత్రి మేనేజ్మెంట్ ఫిర్యాదు చేయగా.. వారు పెద్దగా పట్టించుకోలేదు. కనీసం నిందితుడిపై ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. దీంతో.. బాధితురాలి కుటుంబం .. ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం కాస్త మీడియా దృష్టికి రావడంతో.. పోలీసుల దాకా వెళ్లింది. వారు వెంటనే కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే