జోష్‌లో డ్రైవర్ డ్యాన్స్: ప్రజలపైకి దూసుకెళ్లిన వాహనం, ఇద్దరు మృతి

By narsimha lodeFirst Published May 3, 2019, 10:36 AM IST
Highlights

సికింద్రాబాద్‌ వారాసిగూడలో దారుణం చోటు చేసుకొంది. ఉర్సు ఉత్సవాల్లో ఈ ఘటన జరిగింది. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మైనర్ బాలుడు టాటా ఏస్ వాహనాన్ని  అప్పగించాడు.


హైదరాబాద్:సికింద్రాబాద్‌ వారాసిగూడలో దారుణం చోటు చేసుకొంది. ఉర్సు ఉత్సవాల్లో ఈ ఘటన జరిగింది. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మైనర్ బాలుడు టాటా ఏస్ వాహనాన్ని  అప్పగించాడు.డ్రైవింగ్ రాని బాలుడు వేగంగా వాహానాన్ని  నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

గురువారం రాత్రి వారాసిగూడలో ఉర్సు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సమయంలో  టాటా ఏస్ వాహనం డ్రైవర్ వాహనం దిగాడు. ఉర్సు ఉత్సవాల్లో స్థానికులతో కలిసి డ్యాన్స్ చేశాడు.

వాహనాన్ని మైనర్ బాలుడికి అప్పగించాడు. అయితే డ్రైవర్ డ్యాన్స్ చేస్తున్న సమయంలోనే  టాటా ఏస్ వాహనం రన్నింగ్‌లో ఉంది. ఈ వాహానాన్ని నడుపుతున్న మైనర్ బాలుడు  వాహనాన్ని వేగంగా నడపడం వల్ల ఊరేగింపులో ఉన్న వారిపై నుండి వాహనం దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో కొమరయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మరో బాలుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడ్డాడు. మరో 10 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి వాహనం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

click me!