
హైదరాబాద్‌లో శనివారం రాత్రి కురిసిన వర్షానికి నగరంలోని మణికొండలో డ్రైనేజీలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది . గల్లంతైన వ్యక్తిని గోపిశెట్టి రజనీకాంత్ ( 42 )గా గుర్తించారు . ఘటనాస్థలానికి 50 మీటర్ల దూరంలోనే అతడి ఇల్లు ఉంది . షాద్ నగర్‌లోని నోవా గ్రీన్ కంపెనీలో ఆయన సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
శనివారం రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చిన రజనీకాంత్ .. నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడి గల్లంతయ్యారు . వర్షపు నీటితో నిండి రోడ్డు కనిపించకపోవడంతో గుంతలో పడ్డారు . ఆయన కోసం 2 డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి . నాలాలు కలిసే చోట , నెక్నాంపూర్ చెరువు వద్ద గాలింపు కొనసాగిస్తున్నారు . మణికొండలో ఘటనాస్థలిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు .
మణికొండ ఏరియాలోని గోల్డెన్ టెంపుల్ ముందు కొన్నాళ్లు డ్రైనేజీ వర్క్ జరుగుతున్నది. కొన్నాళ్లుగా ఇక్కడ పనిజరుతున్నా.. అక్కడ సైన్ బోర్డులు తప్పా మరేమీ ఏర్పాటు చేయలేదు. దీంతో వర్షాలు ఎక్కువగా కురవడంతో ఆ సైన్ బోర్డులూ కొట్టుకుపోయాయి. వరదల ప్రవహిస్తుండటంతో అక్కడ డ్రైనేజీ వర్క్ జరుగుతున్నదన్న విషయమే తెలియకుండా పోయింది. అలా వరదలో అటువైపుగా వెళ్లిన ఓ వ్యక్తి డ్రైనేజీలో పడి కొట్టుకుపోయారు.
అక్కడ కనీసం మూడు నెలల నుంచి వర్క్ జరుగుతున్నదని స్థానికులు చెప్పారు. కానీ, జాగ్రత్తగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. శనివారం నాలా వర్క్ చేసిన తర్వాత కూడా ఎలాంటి జాగ్రత్త సూచనలు ఏర్పాటు చేయలేదని తెలిపారు. ఈ విషయాన్ని పాదాచారలు గమనించకుండానే నడుస్తున్నారు. నాలా ముందున్న ఇంటిలో ఓ వ్యక్తి వరదను వీడియో తీస్తున్నాడు. అప్పుడే ఓ వ్యక్తి ఆ డ్రైనేజీలో పడినట్టు గుర్తించాడు. వెంటనే పోలీసులకు విషయాన్ని అందించాడు. వెంటనే పోలీసులు, డీఆర్ఎఫ్, మున్సిపల్ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఆ వ్యక్తి ఆచూకీ తెలియరాలేదని అధికారులు చెప్పారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు తెలిపారు