తెలంగాణలో మరో 17 కరోనా పాజిటివ్ కేసులు: మరొకరు మృతి

By telugu teamFirst Published May 3, 2020, 6:40 AM IST
Highlights

తెలంగాణలో కొత్తగా మరో 17 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరొకరు మరణించారు. కొత్తగా నమోదైన కేసుల్లో 15 కేసులు హైదరాబాదుకు చెందినవే కావడం గమనార్హం.

హైదరాబాద్: తెలంగాణలో శనివారంనాడు కొత్తగా 17 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 15 కేసులు హైదరాబాదులోనే నమోదు కాగా, రెండు రంగా రెడ్డి జిల్లాలో రికార్డయ్యాయి. కాగా, తాజాగా ఒకరు మరణించారు.

తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1061కి చేరుకుంది. మృతుల సంఖ్య 29కి పెరిగింది. శనివారంనాడు కొత్తగా 35 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో మొత్తం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినవారి సంక్య 499కి చేరకుుంది. ప్రస్తుతం 533 మంది చికిత్స పొందుతున్నారు. 

డిశ్చార్జీ అయినవారిలో హైదరాబాదుకు చెందిన వారు 24 మంది ఉన్నారు. సూర్యాపేట, వికారాబాద్ లకు చెందినవారు నలుగురేసి ఉన్నారు. ఆసిఫాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందినవారు ఒక్కరేసి ఉన్నారు. 

వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్ కర్నూల్, ములుగు, పెదపల్లి, సిద్ధిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, నారాయణపేట జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

కరోనా బాధితుల్లో ఎక్కువ మంది యువతే ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మహిళల కన్నా పురుషులు ఎక్కువ ఉన్నారని కూడా చెప్పింది.

click me!