డిగ్రీ, పీజీ ఫైనలియర్ విద్యార్ధులకు పరీక్షలు... మిగిలినవారికి నేరుగా ప్రమోట్: కేసీఆర్

Siva Kodati |  
Published : Jul 16, 2020, 09:21 PM ISTUpdated : Jul 16, 2020, 09:23 PM IST
డిగ్రీ, పీజీ ఫైనలియర్ విద్యార్ధులకు పరీక్షలు... మిగిలినవారికి నేరుగా ప్రమోట్: కేసీఆర్

సారాంశం

కరోనా విషయంలో యూజీసీ, ఏఐసీటీఐ గైడ్‌లైన్స్ ఫాలో అవ్వాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పరీక్షలు నిర్వహణ, సిలబస్ నిర్వహణపై గైడ్ లైన్స్ అమలు చేయాలని సూచించారు

కరోనా విషయంలో యూజీసీ, ఏఐసీటీఐ గైడ్‌లైన్స్ ఫాలో అవ్వాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పరీక్షలు నిర్వహణ, సిలబస్ నిర్వహణపై గైడ్ లైన్స్ అమలు చేయాలని సూచించారు.

ఆగస్టు 15 నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని కేసీఆర్ చెప్పారు. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తామని.. మిగతావారికి పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ఉంటుందని, స్కూల్స్ పున: ప్రారంభం, విద్యాబోధనపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు.

ప్రభుత్వ విద్యా సంస్థల పనితీరు మెరుగుపర్చడంతో ప్రైవేట్ దోపిడీ అరికడతామని, విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థ బలోపేతానికి ప్రణాళిక రూపొందిస్తామని త్వరలోనే విద్యావేత్తలు, నిపుణులతో సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు