కారు డిక్కీలో శవమై తేలిన బాలుడు.. ఉదయం పెళ్లిలో ఆడిపాడి, రాత్రికి..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 08, 2020, 12:32 PM IST
కారు డిక్కీలో శవమై తేలిన బాలుడు.. ఉదయం పెళ్లిలో ఆడిపాడి, రాత్రికి..

సారాంశం

రాత్రి పెళ్లిలో ఆడిపాడిన ఓ బాలుడు ఉదయానికి కారు డిక్కీలో శవమై తేలాడు. ఈ దారుణ ఘటన వనపర్తి జిల్లా అమరచింతలో జరిగింది. తల్లిదండ్రులు లేని ఆ బాలుడి మృతి అనుమానాస్పదంగా మారింది. 

రాత్రి పెళ్లిలో ఆడిపాడిన ఓ బాలుడు ఉదయానికి కారు డిక్కీలో శవమై తేలాడు. ఈ దారుణ ఘటన వనపర్తి జిల్లా అమరచింతలో జరిగింది. తల్లిదండ్రులు లేని ఆ బాలుడి మృతి అనుమానాస్పదంగా మారింది. 

వివరాల్లోకి వెడితే వనపర్తి జిల్లా అమరచింత పట్టణానికి చెందిన కతాల్‌ కూతురి వివాహం ఆదివారం జరిగింది. ఇదే గ్రామానికి చెందిన మోహిద్‌(16) కతాల్ కు దగ్గరి బంధువు. దీంతో పెళ్లిలో చాలా హుషారుగా ఆడిపాడాడు, సందడి చేశాడు. సాయంత్రానికి ఆ ఇంటి ఎదుట ఆగి ఉన్న ఓ కారులో శవమై కనిపించాడు. దీంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.  

అమరచింత పట్టణానికి చెందిన భాను, అఫ్సర్‌ దంపతులకు మోహిద్‌ ఒక్కగానొక్క కుమారుడు. గతంలోనే భార్యను వదిలిపెట్టి అఫ్సర్‌ ఎటో వెళ్లిపోగా రెండేళ్ల క్రితం భాను.. కేన్సర్‌తో మృతి చెందింది. 

దీంతో నా అనేవారు లేక ఒంటరిగా ఉన్న మోహిద్‌ చిన్న, చిన్న కూలి పనులను చేసుకుంటూ రోజువారీ జీవనాన్ని సాగించేవాడు. ఈ క్రమంలోనే తమకు దగ్గరి బంధువు అయిన కతాల్‌ ఇంట్లో జరుగుతున్న పెండ్లి వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ బాలుడు ఆదివారం రాత్రి 11 గంటల టైంలో నిద్రొస్తుందంటూ ఇంటికి వెళ్లిపోయాడు. 

హైదరాబాద్‌కు చెందిన కతాల్‌ బావమరిది ఇసాక్‌ తీసుకొచ్చిన కారు డిక్కీలో సోమవారం సాయంత్రం విగతజీవిగా పడి ఉండటం చూసి అందరూ కన్నీరు మున్నీరయ్యారు. డిక్కీలో ఊపిరి ఆడక చనిపోయాడా? లేక ఎవరైనా అందులో పడవేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే