24 గంటల్లో 135 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,71,946కి చేరిన మొత్తం కరోనా కేసులు

Siva Kodati |  
Published : Nov 03, 2021, 09:24 PM IST
24 గంటల్లో 135 మందికి పాజిటివ్.. తెలంగాణలో 6,71,946కి చేరిన మొత్తం కరోనా కేసులు

సారాంశం

తెలంగాణ (Telangana)లో కొత్తగా 156 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఇద్దరు (corona deaths in telangana) మరణించారు. 135 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,953 యాక్టివ్‌ కేసులు వున్నాయి.  

తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో 35,494 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 156 పాజిటివ్‌ కేసులు  (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,71,946కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు వైరస్ వల్ల (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,960కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 135 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,953 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 2, జీహెచ్ఎంసీ 53, జగిత్యాల 5, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 1, కరీంనగర్ 12, ఖమ్మం 9, మహబూబ్‌నగర్ 1, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 1, మంచిర్యాల 4, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 11, ములుగు 1, నాగర్ కర్నూల్ 0, నల్గగొండ 5, నారాయణపేట 1, నిర్మల్ 0, నిజామాబాద్ 2, పెద్దపల్లి 7, సిరిసిల్ల 3, రంగారెడ్డి 14, సిద్దిపేట 2, సంగారెడ్డి 3, సూర్యాపేట 3, వికారాబాద్ 0, వనపర్తి 1, వరంగల్ రూరల్ 3, వరంగల్ అర్బన్ 6, యాదాద్రి భువనగిరిలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి.

 

PREV
click me!

Recommended Stories

పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu
Viral News: అక్క‌డ మందు తాగితే 25 చెప్పు దెబ్బ‌లు, రూ. 5 వేల ఫైన్‌.. వైర‌ల్ అవుతోన్న పోస్ట‌ర్