తెలంగాణ: 24 గంటల్లో 153 మందికి కరోనా పాజిటివ్.. 6,73,140కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Nov 11, 2021, 10:23 PM IST
తెలంగాణ: 24 గంటల్లో 153 మందికి కరోనా పాజిటివ్.. 6,73,140కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

తెలంగాణ (Telangana)లో కొత్తగా 153 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఇద్దరు (corona deaths in telangana) మరణించారు. 160 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 3,971 యాక్టివ్‌ కేసులు వున్నాయి

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 36,510 కరోనా పరీక్షలు నిర్వహించగా, 153 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 52 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 14, కరీంనగర్ జిల్లాలో 12, రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నారాయణపేట, మెదక్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదుకాకపోవడం గమనార్హం.

160 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 6,73,140కి చేరుకుంది. తాజా రికవరీలతో కలిపి తెలంగాణలో మొత్తం 6,65,432 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,737 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఖ్య 3,971కి పెరిగింది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 4, జీహెచ్ఎంసీ 52, జగిత్యాల 2, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 1, కామారెడ్డి 0, కరీంనగర్ 12, ఖమ్మం 7, మహబూబ్‌నగర్ 3, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 1, మంచిర్యాల 6, మెదక్ 0, మేడ్చల్ మల్కాజిగిరి 4, ములుగు 1, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 14, నారాయణపేట 0, నిర్మల్ 1, నిజామాబాద్ 2, పెద్దపల్లి 3, సిరిసిల్ల 2, రంగారెడ్డి 11, సిద్దిపేట 3, సంగారెడ్డి 2, సూర్యాపేట 4, వికారాబాద్ 0, వనపర్తి 2, వరంగల్ రూరల్ 1, వరంగల్ అర్బన్ 9, యాదాద్రి భువనగిరిలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి.

 

PREV
click me!

Recommended Stories

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి CM రేవంత్ రెడ్డి బోనాలు | Secunderabad Ujjaini Mahankali Bonalu 2026
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తొలి దర్శనం | First Darshan of Ujjaini Mahankali Temple | Bonalu 2026