
సికింద్రాబాద్‌లోని (secunderabad) ఇంపీరియల్ గార్డెన్‌లో (imperial gardens) జరిగిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ (telangana state assembly deputy speaker) పద్మారావు గౌడ్ (padmarao goud) కూతురు వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను సీఎం కేసీఆర్ ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు మంత్రులు మహముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. టీఆర్ఎస్ మాజీ నేత, ప్రస్తుత హుజురాబాద్ ఎమ్మెల్యే (huzurabad mla) ఈటల రాజేందర్ (etela rajender) కూడా ఈ వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.