వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి: 15 మందికి అస్వస్థత

By narsimha lodeFirst Published Mar 7, 2019, 10:30 AM IST
Highlights

హైద్రాబాద్‌లోని నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో వ్యాక్సిన్ తీసుకొన్న 15 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో  ఒక్కరు మృత్యువాత పడ్డారు.

హైదరాబాద్: వ్యాక్సిన్ వికటించి రెండు మాసాల చిన్నారి మృతి చెందగా, మరో 15 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో  వ్యాక్సిన్ వేసిన చిన్నారులకు అస్వస్థతకు గురయ్యారు. ఈ చిన్నారులు ప్రస్తుతం నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  చిన్నారి మృతితో ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

నాంపల్లి  అర్బన్ హెల్త్ సెంటర్‌ నుండి  సుమారు 15 మంది చిన్నారులు వ్యాక్సిన్  తీసుకొన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు.  వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత ఈ చిన్నారులు  అస్వస్థతకు గురయ్యారు. నెలన్నర, రెండు మాసాల చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.

వ్యాక్సిన్  తీసుకొన్న తర్వాత చిన్నారులు నొప్పికి గురికాకుండా ఉండేందుకు ఇచ్చే మందులు ఏమైనా వికటించాయా అనే కోణంలో కూడ వైద్యులు ఆరా తీస్తున్నారు.బుధవారం రాత్రి నుండి  చిన్నారులు అస్వస్థతకు గురౌతున్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులను నాంపల్లి  అర్బన్ హెల్త్ సెంటర్ ‌ నుండి నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.

నీలోఫర్ ఆసుపత్రిలో చిన్నారులను వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు.  అయితే నీలోఫర్ ఆసుపత్రిలో వైద్యులు ఈ చిన్నారులను పరీక్షిస్తున్నారు. మరో వైపు చిన్నారుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

వ్యాక్సిన్  వల్ల  చిన్నారులు అస్వస్థతకు గురి కాలేదని  నీలోఫర్ ఆసుపత్రి చిన్న పిల్లల విభాగం హెచ్ఓడీ డాక్టర్ రవి ప్రకటించారు. అసలు చిన్నారులు ఎందుకు అస్వస్థతకు గురయ్యారనే విషయమై వైద్యులు ఆరా తీస్తున్నారు. గురువారం నాడు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు మాసాల చిన్నారి మృతి చెందాడు.


 

click me!