దిశను చేసినట్లే చేద్దామని... మృగాడి నుంచి తెలివిగా ఇలా...

By sivanagaprasad KodatiFirst Published Dec 12, 2019, 4:31 PM IST
Highlights

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు ఇద్దరు బాలికలను లిఫ్ట్ ఇస్తానని చెప్పి అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఓ బాలిక అతనిపై రాళ్ల వర్షం కురిపించి, తరిమి తరిమి కొట్టింది. 

దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు ఇద్దరు బాలికలను లిఫ్ట్ ఇస్తానని చెప్పి అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఓ బాలిక అతనిపై రాళ్ల వర్షం కురిపించి, తరిమి తరిమి కొట్టింది. 

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామారావుపల్లెకు చెందిన 17 ఏళ్ల డిగ్రీ విద్యార్ధిని తన 14 ఏళ్ల చెల్లితో కలిసి రాయికల్ వెళ్లడానికి సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని బస్టాప్ వద్ద నిల్చొని వున్నారు.

Also Read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: మృతదేహాల గురించి తేల్చని హైకోర్టు

ఈ సమయంలో బైక్‌పై వస్తోన్న ఓ యువకుడు వీరిని గమనించాడు. ‘ఎంత సేపు ఇక్కడ ఎదురుచూస్తరు.. నేను అటుదిక్కే పోతున్న.. మిమ్మల్ని మోటార్‌ సైకిల్‌ మీద రాయికల్‌లో దించుతా. భయపడకండి.. నిన్నమొన్ననే నలుగురిని కాల్చి సంపిండ్రు.. నేను అలాంటోడిని కాదని ఇద్దరిని నమ్మించాడు. 

అతని బైక్ ఎక్కేందుకు ఇద్దరు కొంతసేపు సందేహించినా ఆలస్యం అవుతుండటంతో యువకుడి మోటారు సైకిల్ ఎక్కారు. అనంతరం అక్కాచెల్లెలిని సదరు యువకుడు బైక్‌పై కోరుట్ల మండలం కల్లూరు మోడల్ స్కూలు వెనుక భాగంలో ఉన్న ఐలాపూర్ గుట్ట వైపు తీసుకెళ్లాడు.

దీనిపై అనుమానం కలిగిన బాలికలు సదరు యువకుడిని తమను ఎక్కడికి తీసుకెళ్తున్నావని అడిగారు. దగ్గరలోని పొలంలో నీళ్ల మోటారు ఆన్ చేసి వెళ్దామని చెప్పాడు. అయితే ఐలాపూర్ గుట్టల సమీపంలో డిగ్రీ విద్యార్ధినిని బెదిరించిన ఆ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. 

మృగాడి నుంచి తన అక్కను కాపాడుకోవాలని భావించిన ఆమె చెల్లెలు కేకలు వేస్తూ అతనిని రాళ్లతో కొట్టింది. దీనికి భయపడిన ఆ యువకుడు డిగ్రీ విద్యార్ధిని మెడలో ఉన్న 10 గ్రాముల బంగారు చైన్ లాక్కొని పరారయ్యాడు.

Also Read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: ముగ్గురితో సుప్రీం కమిటీ

తమపై జరిగిన దాడిని బాలికలు తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇటిక్యాల గ్రామంలోని సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించారు. ఇతనిని కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లెకు చెందిన కుంచం వేణుగా నిర్థారించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

click me!