దిశ నిందితుల ఎన్‌కౌంటర్: మృతదేహాల గురించి తేల్చని హైకోర్టు

By narsimha lodeFirst Published Dec 12, 2019, 3:14 PM IST
Highlights

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

హైదరాబాద్: దిశ నిందితుల మృతదేహాలపై హైకోర్టు ఎటు తేల్చలేదు. ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టు విచారణతో పాటు,జాతీయ మానవ హక్కుల సంఘం విచారణను కూడ సుప్రీంకోర్టు నిలిపివేసింది. నిందితుల మృతదేహాలపై ఏం చేయాలనే దానిపై సుప్రీంకోర్టే తన నిర్ణయాన్ని వెల్లడించనుందని మైకోర్టు వ్యాఖ్యానించింది.

తెలంగాణ హైకోర్టులో గురువారంనాడు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిగింది. ఈ విచారణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  దిశ నిందితుల మృతదేహాల విషయమై హైకోర్టు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై గురువారం నాడు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సమయంలోనే కీలక ఆదేశాలను ఇచ్చింది.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘం విచారణను నిలిపివేస్తున్నట్టుగా ఆదేశాలను ఇచ్చిందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై తెలంగాణ హైకోర్టు. మృతదేహాలపై కూడ తుది తీర్పు కూడ సుప్రీంకోర్టు  ఇవ్వనుందని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణను కూడ సుప్రీంకోర్టు నిలిపివేసినట్టుగా తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. మృతదేహాలపై కూడ తుదితీర్పు సుప్రీంకోర్టుదే అని తేల్చి చెప్పిన హైకోర్టు. దిశ నిందితులపై విచారణను కూడ తాము నిలిపివేసినట్టుగా హైకోర్టు స్పష్టం చేసింది. 

అయితే ఈ సమయంలో మృతదేహాల గురించి తెలంగాణ హైకోర్టును లాయర్లు ప్రశ్నించారు. నిందితుల మృతదేహాల గురించి కూడ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొంటుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పులో సందేహాల విషయాన్ని ప్రస్తావించలేదని తెలంగాణ హైకోర్టును లాయర్లు ప్రశ్నించారు.ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేశారు.
 

click me!