శామీర్‌పేట్ కాల్పుల కేసు.. బుల్లితెర నటుడు మనోజ్‌కు 14 రోజుల రిమాండ్, చర్లపల్లికి తరలింపు

Siva Kodati |  
Published : Jul 16, 2023, 04:45 PM IST
శామీర్‌పేట్ కాల్పుల కేసు.. బుల్లితెర నటుడు మనోజ్‌కు 14 రోజుల రిమాండ్, చర్లపల్లికి తరలింపు

సారాంశం

శామీర్‌పేట్ కాల్పుల కేసుకు సంబంధించి బుల్లితెర నటుడు మనోజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అతనికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శామీర్‌పేట్ కాల్పుల కేసుకు సంబంధించి బుల్లితెర నటుడు మనోజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం మనోజ్‌ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే ఈకేసు దర్యాప్తు నిమిత్తం మనోజ్‌ను వారం రోజుల కస్టడీకి అనుమతించాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 

కాగా.. కాల్పుల కేసుకు సంబంధించి మనోజ్ అలియాస్ సూర్యతేజను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. శనివారం నాడు రాత్రి సెలబ్రిటీ విల్లాలో సిద్ధార్ధ దాస్‌పై మనోజ్ ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను ఆర్మ్స్ యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్ధ్ తన భార్య స్మిత 2019లో విడాకులు తీసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె వున్నారు.

ALso Read: షామీర్ పేట కాల్పుల ఘటన: మనోజ్ అరెస్ట్

భర్తతో విడిపోయిన స్మిత.. శామీర్‌పేట్ సెలబ్రిటీ క్లబ్‌లో వుంటున్న బుల్లితెర నటుడు మనోజ్‌తో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో సిద్ధార్ధ్ శనివారం తన పిల్లలను చూసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో మనోజ్, స్మితలతో ఆయన గొడవపడ్డాడు. కోపోద్రిక్తుడైన మనోజ్ తన ఎయిర్‌గన్‌తో సిద్ధార్ధపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడ్డా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

అయితే ఈ కేసులో అనూహ్య ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. మనోజ్ , స్మితలు సినిమాల్లో అవకాశాల పేరుతో అందమైన అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల ఓ సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిని ట్రాప్ చేసి ఆమె నుంచి రూ.50 లక్షలు వసూలు చేశారు. దీనితో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి నుంచి వీరిద్దరూ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Powerful Speech: కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌కు శ్రీకారం | Asianet Telugu
దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ! | Hyderabad Old City House Theft | Thief Sleeping In House