
కామారెడ్డి : కామారెడ్డిలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ చిన్నారి తండ్రి కారు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో 13 నెలలకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండాయి. ఆదివారం నాడు కామారెడ్డి మండలం ఇస్రోజీవాడిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. బారు అయాన్షు 13నెలల చిన్నారి ఆడుకుంటూ తండ్రి కారు కిందికి వచ్చాడు. సిద్దం స్వామి, శ్వేతల కొడుకు. స్వామికి స్విఫ్ట్ డిజైర్ కారు ఉంది. దాన్ని కిరాయికి తిప్పుతుంటాడు. ఆ రోజు కారు ఇంటి దగ్గరే పార్క్ చేసి ఉంది. ఈ కారును స్వామి అన్న సాయిలు బయటికి తీయబోయాడు.
ఆ సమయంలో ఇంట్లో ఆడుకుంటున్న అయాన్ష్ సడెన్ గా బైటికి వచ్చాడు. కారు వెనక నిలుచున్నాడు. ఇది సాయిలు గమనించలేదు. కారును వెనక్కి తీశాడు. దీంతో కారుకింద బాలుడుపడిపోయాడు. చిన్నారి తల మీదినుంచి కారు టైరు పోయింది. కారు శబ్దాలు, వెంటనే బాలుడి ఏడుపు విన్న ఇంట్లోని వారు బైటికి వచ్చి చూసేసరికి బాలుడు కారు కింద ఉన్నాడు. హుటాహుటిన కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి మృతి చెందాడని వైద్యులు దృవీకరించారు.దీనిమీద పోలీసులు కేసు నమోదుచేశారు.