
హైదరాబాద్: మంత్రి Puvvada Ajay kumar ఓ ససైకో అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy మండిపడ్డారు. ఆదివారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. పువ్వాడ అజయ్ కుమార్ ను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Sai Ganesh నుండి పోలీసులు ఎందుకు మరణ వాంగ్మూలం తీసుకోలేదో చెప్పాలని ఆయన కోరారు. ఉద్దేశ్యపూర్వకంగానే సాయి గణేష్ నుండి పోలీసులు మరణ వాంగ్మూలం తీసుకోలేదని ఆయన ఆరోపించారు. Congress పార్టీకి చెందిన ముస్తఫా తదితరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కూడా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధించారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల వేధింపులను నిరసిస్తూ తాము కూడా ఆందోళనలు చేస్తామని జగ్గారెడ్డి చెప్పారు. తాను కూడా ఖమ్మంకి వెళ్లి ఆందోళన చేస్తామని ఆయన చెప్పారు.