తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఆదివారం రాష్ట్రంలో 1,296 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 45,076కి చేరింది.
తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఆదివారం రాష్ట్రంలో 1,296 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 45,076కి చేరింది. ఇవాళ రాష్ట్రంలో కోవిడ్‌తో ఆరుగురు మరణించారు.
వీరితో తెలంగాణలో మృతుల కేసుల సంఖ్య 415కి చేరుకుంది. కరోనా నుంచి ఇప్పటి వరకు 32,438 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ ఒక్క హైదరాబాద్‌లోనే 557 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. రంగారెడ్డి 111, వరంగల్ అర్బన్‌లో 117 మందికి పాజిటివ్‌గా తేలింది.
Also Read:తల్లి కళ్లముందే కొడుకు మృతి: సుమోటోగా తీసుకొన్న ఎన్‌హెచ్ఆర్‌సీ
కాగా, కరోనా లక్షణాలు ఉన్న ఓ యువకుడు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయాడు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని బాధితుడి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ ఘటన నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకొంది.
మాడ్గులపల్లి మండలం సల్కునూరుకు చెందిన ఓ యువకుడు కరోనా లక్షణాలతో నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో శనివారం నాడు చేరాడు. అప్పటికే అతను పలు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరేందుకు వెళ్లినా వైద్యులు నిరాకరించడంతో ప్రభుత్వాసుపత్రిలో చేరాడు.
Also Read:హైద్రాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం: కరోనా ఉన్నా డ్యూటీ చేయాలని నర్సుల నిర్భంధం
శ్వాస తీసుకోవడానికి ఆ యువకుడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అయితే ఈ విషయమై డాక్టర్లకు చెప్పినా కూడ పట్టించుకోలేదని ఆ యువకుడి తల్లి ఆరోపించింది. కనీసం ఆక్సిజన్ పెట్టాలని కోరినా కూడ డాక్టర్లు పట్టీపట్టనట్టుగా వ్యవహరించినట్టుగా ఆమె చెబుతోంది.