ఓఎల్‌ఎక్స్‌లో అమ్మేటప్పుడు జాగ్రత్త: ట్రయల్ వేస్తానని బైక్‌తో జారుకున్న యువకుడు

Siva Kodati |  
Published : Jul 19, 2020, 05:05 PM IST
ఓఎల్‌ఎక్స్‌లో అమ్మేటప్పుడు జాగ్రత్త: ట్రయల్ వేస్తానని బైక్‌తో జారుకున్న యువకుడు

సారాంశం

ప్రస్తుత కాలంలో కేటుగాళ్లు ఏ విధంగానైనా ఎదుటి వారిని మోసం చేసేందుకు వెనుకాడటం లేదు. తాజాగా బైక్ కొంటానని వచ్చిన ఓ యువకుడు ట్రయల్ వేస్తానని చివరికి ద్విచక్ర వాహనంతో సహా ఉడాయించాడు

ప్రస్తుత కాలంలో కేటుగాళ్లు ఏ విధంగానైనా ఎదుటి వారిని మోసం చేసేందుకు వెనుకాడటం లేదు. తాజాగా బైక్ కొంటానని వచ్చిన ఓ యువకుడు ట్రయల్ వేస్తానని చివరికి ద్విచక్ర వాహనంతో సహా ఉడాయించాడు.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ రాజేంద్రనగర్ మండలం కిస్మత్ పూర్‌కు చెందిన పృథ్వీ యాదవ్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న పల్సర్ బైక్‌ను అమ్మడానికి ఓఎల్‌ఎక్స్‌లో పెట్టాడు.

కాగా శనివారం ఉదయం ఆ బైక్ కొంటానని ఓ యువకుడు పృథ్వీ యాదవ్‌కు ఫోన్ చేశాడు. బైక్ తీసుకుని షేక్ నాలా అల్ హమ్రా కాలనీ వద్ద గల డీమార్ట్ షోరూం వద్దకు రమ్మని ఆ యువకుడు పృథ్వీ యాదవ్‌ను ఫోన్‌లో కోరారు.

దీనిలో భాగంగా ఉదయం 11 గంటల ప్రాంతంలో పృథ్వీ యాదవ్ అక్కడికి వెళ్లగా.. పేపర్లు, ఇన్సూరెన్స్ అంటూ వివరాలు అడిగాడు. అలాగేనని ఊ కొట్టి బైక్ తీసుకుని ట్రయల్ కొడతానని చెప్పి.. మూడు ట్రయల్స్ వేశాడు. మళ్లీ ట్రయల్స్ వేస్తానని చెప్పి బైక్‌తో జారుకున్నాడు.

ఆ యువకుడు ఎంత సేపటికి రాకపోవడంతో పృథ్వీ యాదవ్ అతనికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : రుతుపవనాలు అలర్ట్, అల్పపీడనం క్రియేట్, ద్రోణి, ఆవర్తనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాలపై ఇక వర్షాల దండయాత్రే, ఈదురుగాలులతో దబిడిదిబిడే
Kalvakuntla Kavitha: కొడంగల్‌లో 22 వేల డూప్లికేట్ ఓట్లు? కవిత సంచలన కామెంట్స్| Asianet News Telugu