గాంధీ ఆసుపత్రిలో కరోనా కల్లోలం: 120 మంది వైద్యులకు కోవిడ్

By narsimha lodeFirst Published Jan 17, 2022, 4:54 PM IST
Highlights

గాంధీ ఆసుపత్రిలో 120 మంది వైద్యులకు కోవిడ్ సోకింది. ఇంకా కొందరు వైద్యుల కరోనా రిపోర్టులు రావాల్సి ఉంది. గాంధీ ఆసుపత్రిలో కరోనా సోకిన వైద్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

హైదరాబాద్: Gandhi ఆసుపత్రిలోcorona కల్లోలం సృష్టించింది. గాంధీ ఆసుపత్రిలో పనిచేసే 120 మంది వైద్యులు కరోనా బారినపడ్డారు.ఇంకా మరికొందరు వైద్యుల కరోనా రిపోర్టు రావాల్సి ఉంది.

గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో పనిచేసే 40  మంది PG విద్యార్ధులకు, 38 మంది హౌస్ సర్జన్లకు, 35 మంది MBBS విద్యార్ధులకు, ఆరుగురు ఫ్యాకల్టీలకు కరోనా సోకింది. ఇంకా కొందరు వైద్యుల కరోనా రిపోర్టులు రావాల్సి ఉంది. 

Latest Videos

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.ఆదివారం నాడు రాష్ట్రంలో  రెండువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేబినెట్ లో చర్చించనుంది. ఇప్పటికే విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తొలుత ఈ నెల 8 నుండి 16వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. అయితే కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు Holidays ఈ నెల 17 నుండి 30వ తేదీ వరకు పొడిగించారు.  ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో  తొమ్మిది మంది డాక్టర్లకు కూడా కరోనా సోకింది. ఈ ఆసుపత్రిలో  ఇన్ పేషేంట్లుగా ఉన్న 57 మంది రోగులకు కూడా కరోనా సోకింది.

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం  కఠిన ఆంక్షలు అమలు చేయాలని భావిస్తోంది. night curfew విధించాలా లేదా కరోనా ఆంక్షలను మరింత కఠినతరం చేయాలా అనే విషయమై రాష్ట్ర కేబినెట్ లో చర్చించనున్నారు.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై High Court  సోమవారం నాడు విచారణ చేపట్టింది.  ఈనెల 12 వరకు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. 

 ప్రతి రోజూ లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలనిత హైకోర్టు ఆదేశించింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్రంలో క‌రోనా నియ‌మ నిబంద‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని సూచించారు. అలాగే.. భౌతికదూరం, మాస్కులు ధ‌రించ‌డం వంటి నిబంధ‌న‌లను క‌ఠిన‌త‌రం చేయాల‌ని సూచించారు. 

రోజురోజుకు క‌రోనా వ్యాప్తి వేగ వంతం అవుతున్న త‌రుణంలో నియంత్రణ చ‌ర్య‌ల‌ను క‌ఠిన‌త‌రంగా అమలు చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది.  కరోనా నియంత్రణపై ఇవాళ మంత్రివర్గం చర్చిస్తున్నట్లు Advocate General హైకోర్టుకు తెలిపారు. స‌మావేశ పూర్తివివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. వైద్య శాఖలో సెలవులను రద్దు చేసింది. మరో నాలుగు వారాల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా వైద్య శాఖ ప్రజలను కోరింది. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించింది వైద్య శాఖ.

click me!