తెలంగాణలో 33 వేలు దాటిన కరోనా: కొత్తగా 1,178 కేసులు, 9 మంది మృతి

By Siva KodatiFirst Published Jul 11, 2020, 9:55 PM IST
Highlights

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. శనివారం కొత్తగా 1,178 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,402కి చేరింది

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. శనివారం కొత్తగా 1,178 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,402కి చేరింది.

ఇవాళ కరోనాతో 9 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 348కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 12,135 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 20,919 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 1,714 మంది డిశ్చార్జ్ కావడం విశేషం.

Also Read:కరోనా పరీక్షలు చేపించుకున్న ఒవైసి, ప్రజలకు విన్నపం

శనివారం ఒక్క హైదరాబాద్‌లోనే 736 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 125, మేడ్చల్ 101, సంగారెడ్డి 13, కరీంనగర్ 24, సిరిసిల్ల 24, వరంగల్ అర్బన్ 20 మందికి పాజిటివ్‌గా తేలింది. 

మరోవైపు నిజామాబాద్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కరోనా వైరస్ తో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తరలించడంలో గందరగోళం చోటు చేసుకుంది. మృతదేహం తరలింపులో నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 

Also Read:దిక్కులేని వారిని చేయకండి.. కాస్త పెద్ద మనసు చేసుకోండి: కేసీఆర్‌కు రచ్చ రవి రిక్వెస్ట్

మృతదేహాన్ని ఆటోలో తరలించారు. అలా తరలించడం కరోనా వైరస్ మార్గదర్శకాలకు విరుద్ధం. కోరనా రోగి మృతదేహాన్ని అంబులెన్స్ లో ఎస్కార్టు వాహనంతో తరలించాల్సి ఉంటుంది. పైగా, మృతదేహాన్ని తరలించిన ఆటో  డ్రైవర్ కు గానీ, అతని పక్కన కూర్చున వ్యక్తికి గానీ పీపీఈ కిట్లు లేవు.

అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని ఆటోలో తరలించాల్సి వచ్చిందని అంటున్నారు. ఆస్పత్రిలో ముగ్గురు కరోనా వైరస్ రోగులు మరణించారని, దాంతో అంబులెన్స్ అందుబాటులో లేదని చెబుతున్నారు. 

click me!