తెలంగాణలో కొనసాగుతున్న తగ్గుదల: ఇవాళ 11 కేసులు... అన్ని హైదరాబాద్‌ పరిధిలోనే

Siva Kodati |  
Published : May 06, 2020, 09:01 PM ISTUpdated : May 06, 2020, 09:11 PM IST
తెలంగాణలో కొనసాగుతున్న తగ్గుదల: ఇవాళ 11 కేసులు... అన్ని హైదరాబాద్‌ పరిధిలోనే

సారాంశం

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుదల కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో నమోదైన కరోనా కేసులు 1107కి చేరుకున్నాయి. 

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుదల కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో నమోదైన కరోనా కేసులు 1107కి చేరుకున్నాయి. ఇవాళ 20 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు... దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 648కి చేరింది.

ఇప్పటి వరకు వైరస్ కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆసుపత్రుల్లో 430 మంది చికిత్స పొందుతున్నారు. కాగా బుధవారం నమోదైన కేసులన్నీ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం.

Also Read:హైదరాబాద్‌ను దిగ్బంధించండి... వైరస్ అంతుచూడండి: కేసీఆర్

కాగా తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 29 వరకు పొడిగిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందు నుంచి పకడ్బందీగా చర్యలు చేపట్టడం వల్ల వైరస్‌ను అదుపు చేసి దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచామని కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ నుంచి నేర్చుకుని మిగిలిన ప్రాంతాల్లో అమలు చేశామని ఆయన చెప్పారు.

దేశంలో మరణాల రేటు 3.37 శాతంగా ఉంటే తెలంగాణలో 2.64 శాతంగా ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 42.7 శాతంగా ఉందని.. కరోనా కట్టడికి కృషి చేసిన అధికారులు, నేతలు, సిబ్బందిని కేసీఆర్ అభినందించారు.

Also Read:మందుకు వేళాయెరా... తెలంగాణలో వెర్రెత్తిన తాగుబోతులు

కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ కోసం సీరియస్‌గా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగస్టు, సెప్టెంబర్ నాటికి అది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీఎం వెల్లడించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని.. మనదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో భయంకరంగా చనిపోతున్నారని కేసీఆర్ గుర్తుచేశారు.
 

PREV
click me!

Recommended Stories

CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu
విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu