సికింద్రాబాద్ స్క్రాప్ గోడౌన్ ప్రమాదం: 11 మంది సజీవ దహనానికి కారణమిదీ, ఓనర్ సంపత్ అరెస్ట్

Published : Mar 23, 2022, 09:33 AM ISTUpdated : Mar 23, 2022, 10:02 AM IST
సికింద్రాబాద్ స్క్రాప్ గోడౌన్ ప్రమాదం: 11 మంది సజీవ దహనానికి కారణమిదీ, ఓనర్ సంపత్ అరెస్ట్

సారాంశం

సికింద్రాబాద్ స్క్రాప్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఫై ఫోర్‌లో ఉన్న 11 మంది కార్మికులు కిందకు రాలేకపోవడంతో సజీవ దహనమయ్యారని పోలీసులు అనుమానిస్తున్నారు

హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిగూడలో 11 మంది కార్మికులు సజీవ దహనమైన ఘటనలో Scrap Godownయజమాని సంపత్ ను పోలీసులు బుధవారం నాడు ఉదయం అరెస్ట్ చేశారు.  స్క్రాప్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా Fire accident వాటిల్లిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది ఫైరింజన్లు మంటలను ఆర్పారు. 

బుధవారం నాడు తెల్లవారుఝామున నాలుగు గంటల సమయంలో ఈ స్క్రాప్ గౌడౌన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ మంటల తాకిడికి ఈ గోడౌన్ లో ఉన్న  Cylinder  పేలింది. ఈ పేలుడు శబ్దం విన్న స్థానికులు policeకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. అగ్ని మాపక సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చే సమయానికే ఈ గోడౌన్ లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి  ఉన్నాయి.  గోడౌన్ కింద భాగంలో Prem  అనే వ్యక్తి తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి ఉన్నాడు.

అతడిని ఆసుపత్రికి తరలించే సమయంలో గోడౌన్ లోని పై భాగంలో ఇంకా 11 మంది ఉన్నారని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు పై భాగంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి ఉన్నాయి. దీంతో  గోడౌన్ పై భాగాన్ని పగులగొట్టి లోపలికి వెళ్లారు పోలీసులు, డిజాస్టర్ సిబ్బంది. అయితే అప్పటికే ఈ ప్రాంతంలో 11 మంది  సజీవ దహనమై ఉన్నారు. మంటల ధాటికి గోడౌన్ పై ఉన్న సిమిెట్ రేకులు కూడా కుప్పకూలాయి. ఈ 11 మంది సజీవ దహనమయ్యారు. వీరి dead bodies గుర్తు పట్టలేనంతగా ఉన్నాయి. ఈ మృతదేహలను పోలీసులు గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. డిఎన్ఏ టెస్ట్ చేస్తే కానీ  మృతదేహలను గుర్తు పట్టే పరిస్థితి ఉండదని పోలీసులు చెప్పారు.

గోడౌన్ కింది భాగంలో ఉన్న రూమ్ లో ముగ్గురు ఉంటారు. పై భాగంలో మిగిలినవారు ఉంటారు. పై భాగంలో ఉన్న వారు కిందికి రావాలంటే గోడౌన్ మధ్యలో ఉన్న ఇనుప మెట్ల నుండి కిందకు రావాల్సి ఉంటుంది. అయితే మంటలు తీవ్రంగా వ్యాప్తి చెందిన కారణంగా  ఇనుప మెట్ల నుండి ఫై ఫ్లోర్ లో చిక్కుకున్న కార్మికులు కిందకు రాలేకపోయారు.  అంతేకాదు  ఈ గోడౌన్ కు బయటకు వెళ్లేందుక మరో దారి కూడా లేదు. దీంతో పై ఫ్లోర్‌లో ఉన్న కార్మికులు కిందకు రాలేకపోయినట్టుగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారిని బిట్టు, సికిందర్, దామోదర్, సత్యేంతర్, చింటు,దినేష్, రాజేష్, రాజు, దీపక్, పంకజ్ లుగా గుర్తించారు. మృతులంంతా బీహార్ రాష్ట్రానికి చెందినవారు. 

మరోవైపు గోడౌన్ నిర్వహణకు కూడా యజమాని సంపత్ అనుమతులు తీసుకోలేదని సమాచారం. జవావాసాల మధ్యే గోడౌన్ కు ఎలా అనుమతించారనే విషయమై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదాలు జరిగిన సమయాల్లోనే ప్రమాదానికి కారణమైన గోడౌన్లు, సంస్థలకు అనుమతులు లేవనే విషయాలు అధికారుల దృష్టికి రావడం హాస్యాస్పదంగా ఉందని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నారు. గతంలో జరిగిన అగ్ని ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో

ఇదిలా ఉంటే గోడౌన్ ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై  సమగ్రంగా విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.  
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Biggest Airports in India : అతిపెద్ద విమానాశ్రయం మన హైదరాబాద్ దే.. ఎన్ని వేల ఎకరాల్లో ఉందో తెలుసా?
CM Revanth Reddy Speech: కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu