తెలంగాణలో 11 కరోనా ఫ్రీ జిల్లాలు ఇవే...

By telugu team  |  First Published Apr 30, 2020, 11:53 AM IST

తెలంగాణలో కోరనా వైరస్ తగ్గుముఖం పడుతోందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. 11 జిల్లా కరోనా ఫ్రీ అయినట్లు తాజాగా అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ జాబితాను కూడా ఇచ్చాయి.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ ఆక్టివ్‌ కేసులు లేకుండా ఉన్న జిల్లాలు 11 ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. కరోనా ఫ్రీ జిల్లాలు: సిద్దిపేట, మహబూబాబాద్‌, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, వనపర్తి, పెద్దపల్లి, వరంగల్‌ రూరల్‌, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, ములుగు జిల్లాల్లో కరోనా ఆక్టివ్‌ కేసులు లేకుండా ఉన్నాయి. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు 1016 మంది బాధితులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. కరోనా నుంచి కోలుకుని నిన్న 35 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. నిన్న డిశ్చార్జ్‌ అయిన వారిలో 13 మంది చిన్నారులు ఉన్నారు. తెలంగాణలో మొత్తం 33 జిల్లాలున్నాయి. జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతన్నాయి.

Latest Videos

undefined

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.10 మందిలో ఒకరు వెంటిలేటర్‌పై ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా నుంచి కోలుకున్న 23 రోజుల బాబుకు నెగిటివ్‌ రావడంతో వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు.

తెలంగాణలో మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు.

click me!