
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో కిడ్నాప్ కలకలం సృష్టించింది. కౌశిక్ అనే విద్యార్థిని దుండుగులు బలవంతంగా అపహరించుకుపోయారు. స్థానిక ఠాగూర్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కౌశిక్ బుధవారం రాత్రి ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగివస్తుండగా.. ఇన్నోవాలో వచ్చిన గుర్తు తెలియని దుండగులు బాలుడిని ఎత్తుకుపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ 22ఈఈ 5201 నెంబర్ గల కారులో దుండగులు వచ్చినట్లు గుర్తించారు. కౌశిక్ తండ్రి వెంకటయ్య గౌడ్ ప్రైవేట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు.