టీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న రమేశ్ రాథోడ్

By Arun Kumar PFirst Published Sep 20, 2018, 9:18 AM IST
Highlights

టీఆర్ఎస్‌కు మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ గుడ్ బై చెప్పారు. టిక్కెట్ల కేటాయింపులో తనకు అన్యాయం చేశారని అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న రమేశ్ పార్టీ మారుతారని ఊహాగానాలు వినిపించాయి.

టీఆర్ఎస్‌కు మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ గుడ్ బై చెప్పారు. టిక్కెట్ల కేటాయింపులో తనకు అన్యాయం చేశారని అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న రమేశ్ పార్టీ మారుతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే తాను ఖానాపూర్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రజల సమక్షంలో చెప్పిన ఆయన యూటర్న్ తీసుకున్నారు.

కార్యకర్తలతో సమావేశం అనంతరం కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రమేశ్‌ రాథోడ్.. ఉమ్మడి రాష్ట్ర టీడీపీలో జిల్లాలో చక్రం తిప్పారు. తాను ఎంపీగా.. భార్య సుమన్ రాథోడ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి దిగజారడంతో గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

click me!
Last Updated Sep 20, 2018, 9:18 AM IST
click me!