బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు.. ఎగ్జామ్స్ లేకుండానే పాస్

By Siva KodatiFirst Published Jun 8, 2020, 5:37 PM IST
Highlights

కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను  రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పరీక్షలు లేకుండానే విద్యార్థులు పాస్ అయినట్లుగా ప్రకటిస్తారు. ఇంటర్నల్, అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్ధులను ప్రమోట్ చేస్తారు. 
 

కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను  రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పరీక్షలు లేకుండానే విద్యార్థులు పాస్ అయినట్లుగా ప్రకటిస్తారు.

ఇంటర్నల్, అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్ధులను ప్రమోట్ చేస్తారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న 5 లక్షల 34 వేల 903 మంది విద్యార్ధులు నేరుగా  ప్రమోట్ అయినట్లే. డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. 

ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా పరిస్ధితులు అధ్యయనం చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని నిర్ణయించింది. 

click me!