తెలంగాణలో అదుపులోకి కరోనా: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ‘‘సున్నా’’ కేసులు

Siva Kodati |  
Published : Jun 20, 2021, 09:22 PM ISTUpdated : Jun 20, 2021, 09:23 PM IST
తెలంగాణలో అదుపులోకి కరోనా: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ‘‘సున్నా’’ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి వచ్చినట్లే కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో 87,854 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,006 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ (141) మినహా, తెలంగాణ జిల్లాల్లో 100కి లోపే కొత్త కేసులు వెలుగుచూశాయి

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి వచ్చినట్లే కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో 87,854 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,006 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ (141) మినహా, తెలంగాణ జిల్లాల్లో 100కి లోపే కొత్త కేసులు వెలుగుచూశాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. అదే సమయంలో రాష్ట్రంలో 1,798 మంది కరోనా నుంచి కోలుకోగా.. 11 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3,567 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,13,202 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,91,870 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 17,765 యాక్టివ్ కేసులు వున్నాయి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 96.52 శాతంగా ఉంది.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 0, భద్రాద్రి కొత్తగూడెం 50, జీహెచ్ఎంసీ 141, జగిత్యాల 17, జనగామ 12, జయశంకర్ భూపాలపల్లి 11, గద్వాల 10, కామారెడ్డి 4, కరీంనగర్ 62, ఖమ్మం 88, మహబూబ్‌నగర్ 21, ఆసిఫాబాద్ 3, మహబూబాబాద్ 28, మంచిర్యాల 26, మెదక్ 9, మేడ్చల్ మల్కాజిగిరి 58, ములుగు 8, నాగర్ కర్నూల్ 13, నల్గగొండ 64, నారాయణపేట 5, నిర్మల్ 0, నిజామాబాద్ 9, పెద్దపల్లి 27, సిరిసిల్ల 21, రంగారెడ్డి 79, సిద్దిపేట 34, సంగారెడ్డి 18, సూర్యాపేట 68, వికారాబాద్ 16, వనపర్తి 29, వరంగల్ రూరల్ 17, వరంగల్ అర్బన్ 41, యాదాద్రి భువనగిరిలో 17 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

Kavitha Comments: అలా చేస్తేనే మహిళలల రిజర్వేషన్ బిల్ వచ్చే ఆస్కారం | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లుపై BJP Bandaru Vijayalakshmi Reaction | Telangana | Asianet News Telugu