తెలుగు రాష్ట్రాల రైతులు అప్పుల భారంతో సతమతమవుతున్నారు. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం శనివారం వెల్లడించింది.
రైతే దేశానికి వెన్నముఖ.. రైతు లేనిదే దేశం లేదు.. రైతే రాజు.. ఇలా ఎన్ని నినాదాలు ఉన్నప్పటికీ రైతు బతుకు మాత్రం మారడం లేదు. దేశానికి అన్నం పెట్టే అన్నదాత కనీసం పట్టెడు అన్నం కూబి సంతోషంగా తినలేకపోతున్నాడు. రైతు రాజు కావడం ఏంటో గాని అప్పుల ఊబిలో నుంచి మాత్రం బయటకు రాలేకపోతున్నాడు. ఇలా అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాల రైతులే అధికంగా ఉన్నారని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఆర్థికంగా ఎదగలేకపోతున్న రైతులు..
రైతుల కోసం ఎన్నో చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా.. రైతును మాత్రం అప్పుల ఊబిలో నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నాయి. ఎన్ని పథకాలు తీసుకొచ్చినా అవి రైతు ఆర్థిక పరిస్థితిని మాత్రం మెరుగుపర్చలేకపోతున్నాయి. రైతులను కేవలం ఓటు బ్యాంకుగా చూసే పార్టీలు, ప్రభుత్వాలు ఉన్నన్ని రోజులు రైతుల పరిస్థితి మారదు. ప్రభుత్వాలు అన్నదాతలపై బాధ్యతగా మసులుకున్నప్పుడు మాత్రమే రైతుల జీవితాల్లో మార్పు కనిపిస్తుంది. ఓట్లు కురిపించే సంక్షేమ పథకాలనే పట్టుకొని వేలాడకుండా.. ఏం చేస్తే రైతు సంస్థాగతంగా బలపడుతాడో అనే విషయంపై దృష్టి పెట్టాలి. ఈ దిశగానే ప్రభుత్వాలు ఆలోచించినప్పుడు మాత్రమే రైతులు ఆర్థికంగా బలపడుతాడు.
undefined
https://telugu.asianetnews.com/telangana/telangana-cm-kcr-review-on-paddy-procurement-r3laq7
ఎందుకిలా ?
తెలుగు రాష్ట్రాల రైతులు అప్పుల ఊబిలో ఉండిపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. దుక్కి దున్నిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు పొలంపై పెట్టే పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. విత్తనాల ధరలు, ఎరువుల ధరలు, పురుగు మందుల ధరలు కూడా ప్రతీ ఏటా పెరుగుతున్నాయి. కూలీల కొరత ఉండటంతో అధికంగా కూలి చెల్లించాల్సి వస్తున్నది. ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా మద్దతు ధరలు ఉండటం లేదు. పెట్టుబడికి 50 శాతం అధనంగా కలిపి మద్దతు ధర కల్పించాలని చెప్పిన స్వామినాథన్ కమిషన్ ఎవరూ అమలు చేయడం లేదు. అసలు ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు కూడా వేయడం లేదు.
ఈ కారణాలన్నింటికీ తోడు మధ్యలో వచ్చే అకాల వర్షాలు, వరదలు రైతులను మరింత అగాదంలోకి నెట్టివేస్తున్నాయి. ఈ అకాల వర్షాల వల్ల కొన్ని సార్లు పొలంలో ఉన్న మొక్కలు చనిపోతున్నాయి. కొన్ని సార్లు కల్లాల్లో ఉన్న ధాన్యం కొట్టుకుపోవడం, తడిసిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. కొన్ని సార్లు సమయానికి వర్షం పడకపోవడం వల్ల కూడా పంటలు సరిగా పండటం లేదు. దీంతో రైతులకు గిట్టుబాటుకావడం లేదు. ప్రతీ ఏటా అప్పుల్లో మునిగిపోతున్న రైతు మాత్రం వ్యవసాయం చేయడం ఆపడం లేదు. కొత్త అప్పులు తీసుకొచ్చి మరీ పంటపై పెట్టుబడి పెడుతున్నాడు. కాలం కలిసిరాని సందర్భంలో మరింత అప్పుల్లోకి దిగజారుతున్నాడు. అందుకే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి.
రాష్ట్రాల వారీగా రైతుల అప్పులు..
దేశంలో అన్ని రాష్ట్రాల రైతులు ఎంత మేరకు అప్పులు ఉన్నారనే విషయాన్ని శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాజ్యసభలో ఈ వివరాలు వెల్లడించింది. అందులో 93.2 శాతంతో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. 91.7 శాతంతో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని తెలిపింది. కేరళ 69.9 శాతం, కర్నాటక 67.7 శాతం, తమిళనాడు 65.1 శాతం, ఒడిశా 61.2 శాతం, మహారాష్ట్రలో 54 శాతం రైతులు రుణభారంతో సతమతమవుతున్నారని ప్రకటించింది.