హైద్రాబాద్ ముషీరాబాద్‌ స్క్రాప్ గోడౌన్‌లో పేలుడు: ఒకరికి గాయాలు

Published : Aug 19, 2023, 03:09 PM ISTUpdated : Aug 19, 2023, 03:16 PM IST
హైద్రాబాద్ ముషీరాబాద్‌ స్క్రాప్ గోడౌన్‌లో పేలుడు: ఒకరికి గాయాలు

సారాంశం

హైద్రాబాద్ నగరంలోని  ముషీరాబాద్ లోని స్క్రాప్ గోడౌన్ లో ఇవాళ పేలుడు చోటు చేసుకుంది . ఈ ఘటనలో  ఒకరు గాయపడ్డారు.

 

హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్ స్క్రాప్ గోడౌన్ లో  శనివారంనాడు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో  గోడౌన్ లో పనిచేస్తున్న కార్మికుడు గాయపడ్డారు.చికిత్స నిమిత్తం అతడిని  గాంధీ ఆసుపత్రికి తరలించారు.  గోడౌన్ లోని  కెమికల్ బాక్స్ ను కట్ చేస్తున్న సమయంలో పేలుడు చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు.

ఈ స్క్రాప్ గోడౌన్ పక్కనే  స్కూల్ ఉంది.  ఈ గోడౌన్ లో పేలుడుతో స్కూల్ లోని విద్యార్థులు భయపడ్డారు.  నివాసాల మధ్యే ఈ స్క్రాప్ గోడౌన్ ఉంది. స్క్రాప్ గోడౌన్  లో గాయపడిన కార్మికుడిని గౌసుద్దిన్ గా గుర్తించారు. గౌసుద్దిన్  వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్క్రాప్ గోడౌన్ లో పేలుడుకు గల కారణాలపై  పోలీసులు ఆరా తీస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం