కీలక సమావేశానికి డుమ్మా.. స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి హాజరు, జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్ రెడ్డి ఫైర్

Siva Kodati |  
Published : Aug 19, 2023, 02:22 PM IST
కీలక సమావేశానికి డుమ్మా.. స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి హాజరు, జీహెచ్ఎంసీ అధికారులపై కిషన్ రెడ్డి ఫైర్

సారాంశం

జీహెచ్ఎంసీ అధికారులపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.   రెండ్రోజులుగా ముందు సమావేశం పెట్టుకుని మీటింగ్‌కు డుమ్మా కొడతారా అని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. 

జీహెచ్ఎంసీ అధికారులపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల ముందే నిర్ణయించిన దిశా మీటింగ్‌కు అధికారులు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం వుందని తెలిసి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. రెండ్రోజులుగా ముందు సమావేశం పెట్టుకుని మీటింగ్‌కు డుమ్మా కొడతారా అని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కనీసం సమావేశంలో సమాధానం చెప్పేవారు కూడా లేరని దుయ్యబట్టారు. ఆర్వోబీ నిర్మాణానికి రైల్వే శాఖ ఒప్పుకున్నా జీహెచ్ఎంసీ సహకరించడం లేదని రైల్వే అధికారులు కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. జీహెచ్ఎంసీ సహకారం లేకపోవడంతో పనులు పెండింగ్‌లో పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!