తెలంగాణలో కరోనా మరణాలు 1.1 శాతమే: మంత్రి ఈటల

By narsimha lode  |  First Published Jun 29, 2020, 1:11 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య కేవలం 1.1 శాతం మాత్రమేనని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.



హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య కేవలం 1.1 శాతం మాత్రమేనని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో కరోనా మరణాలు 1.1 శాతం మాత్రమేనని ఆయన చెప్పారు.  దేశంలో కరోనా మరణాలు 3 శాతంగా ఉన్నట్టుగా మంత్రి వివరించారు. దేశంలోని కరోనా మరణాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య అతి తక్కువగా ఉందన్నారు. హైద్రాబాద్ లో కూడ కేసులు  పెరుగుతున్నాయన్నారు. 

Latest Videos

undefined

హైద్రాబాద్ కంటైన్మెంట్ జోన్లలో జీహెచ్ఎంసీతో కలిసి పనిచేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.  రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచామన్నారు. 

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అవసరమైతే లాక్ డౌన్ పెడతామని సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా మంత్రి ఈటల రాజేందర్ వివరించారు.

నాలుగైదు రోజుల్లో కేబినెట్ సమావేశం నిర్వహించి లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకొంటామన్నారు. ప్రజలకు వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం సంసిద్దంగా ఉందని చెప్పారు. 

వైద్య ఆరోగ్య శాఖలో 257 మందికి, పోలీసు శాఖలో 184 మందికి కరోనా సోకినట్టుగా ఆయన తెలిపారు. వీరంతా కరోనా నుండి కోలుకొన్నట్టుగా మంత్రి వివరించారు. 

గాంధీ ఆసుపత్రిలో 10 మంది రోగులు మాత్రమే వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారన్నారు. లక్షణాలు లేని వాళ్లంతా పరీక్షల కోసం ఆసుపత్రుల ముందు క్యూ కట్టొద్దని మంత్రి సూచించారు.

కరోనా రోగుల కోసం 17వేల బెడ్స్ సిద్దం చేశామన్నారు. ఇప్పటికే 3 వేల బెడ్స్ కు ఆక్సిజన్ ఇచ్చామన్నారు. ఇంకా మరో 7 వేల బెడ్స్ కు  ఆక్సిజన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పట్టించుకోవడంలేదని సోషల్ మీడియా లో దుష్పచారం బాధాకరమన్నారు. చెస్ట్ హాస్పిటల్ లో కి వచ్చిన పేషంట్ అనేక హాస్పిటల్స్ లో తిరిగి వచ్చిన తర్వాత చెస్ట్ ఆసుపత్రికి వచ్చినట్టుగా మంత్రి వివరించారు. 

 మిడ్ నైట్ వచ్చినా కూడా చేర్చుకొని రాత్రి అంతా ఆక్సిజన్ ఇచ్చామన్నారు.. కానీ ఆయన గుండె జబ్బుతో చనిపోవడం బాధాకరం. ఆక్సిజన్ అందిచలేదు అనడం నిజం కాదని ఆయన తెలిపారు. 

రేపటి నుండి జీహెచ్ఎంసీ పరిధిలో తిరిగి టెస్టులను ప్రారంభించనున్నట్టుగా  మంత్రి తెలిపారు. అవసరమైన వారంతా ఆయా సెంటర్ల వద్దకు వచ్చి శాంపిల్స్ ఇవ్వాలని కోరారు. 

click me!