మంత్రి కేటీఆర్ ఈ రోజు దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ఈ సారి దుబ్బాక కోరుతున్నామని అన్నారు. రఘునందన్ రావు లుచ్చా మాటలు మాట్లాడుతున్నాడని, ఆయన ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదని ఫైర్ అయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీకి దుబ్బాక విజయం అనూహ్యమైన బలాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పై హోరాహోరీగా పోరాడి బీజేపీ పైచేయి సాధించింది. టీఆర్ఎస్ సీటును బీజేపీ లాక్కుంది. అప్పుడు టీఆర్ఎస్‌కు దుబ్బాక ఓటమి నైతికంగా దెబ్బేసింది. దుబ్బాకలో ఈ సారి ఎలాగైనా గెలవాలని బీఆర్ఎస్ పంతం పట్టుకుంది. అందుకే ఈ స్థానం నుంచి ఏకంగా ఎంపీనే బరిలోకి దించింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని దుబ్బాక నుంచి బీఆర్ఎస్ బరిలో నిలిపింది.
తాజాగా, దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్‌లో బీఆర్ఎస్ యువగర్జన సభ నిర్వహించింది. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. ఈ సభలో అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు.
undefined
గతంలో దుబ్బాక మాకు దక్కలేదు. ఈ సారి దుబ్బాకను కోరుతున్నాం. ఇక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఇంటికే పరిమితం అవుతారని మంత్రి కేటీఆర్ అన్నారు. రఘునందన్ రావు పై ఒంటికాలిపై లేశారు. ఆయన చాలా సార్లు లుచ్చా మాటలు మాట్లాడారని, ఇంకా మాట్లాడుతూనే ఉన్నారని ఆగ్రహించారు. అప్పుడు ఆయన చెప్పిన హామీలు ఏవీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు.
Also Read: Nirmala Sitharaman: కేంద్ర ప్రభుత్వ పాలసీలతోనే హైదరాబాద్‌కు కంపెనీలు: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
బీఆర్ఎస్ పాలనను పరిశీలించి ఓటేయాలని, అన్ని వర్గాల అభ్యున్నతి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సాధ్యం అని వివరించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితమో ఆలోచించి ఓటేయండని సూచించారు. రఘునందన్ రావు పై అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా విమర్శలు సంధించారు.
నిజానికి దుబ్బాక గెలిచినప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఒక కొత్త జోష్‌తో ఉంది. కానీ, ఇప్పుడు అదే ఉత్తేజం కనిపించడం లేదు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే రేంజ్‌లో అప్పుడు ఉంది. కానీ, ఇప్పుడు నెంబర్ 3కి పరిమితం అవుతున్నది. ఈ సందర్భంలో బీజేపీ మళ్లీ దుబ్బాక సీటును గెలుచుకోవడం కష్టసాధ్యం.