Vikas Raj...కవిత, రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులందాయి: తెలంగాణ సీఈఓ వికాస్‌రాజ్

By narsimha lodeFirst Published Nov 30, 2023, 1:57 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికలపై పలు ఫిర్యాదులు అందినట్టుగా  తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు.  గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ పర్సంటేజీ బాగుందని  వికాస్ రాజ్ తెలిపారు.  

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులుఅందాయని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి  రేవంత్ రెడ్డి  చెప్పారు.  

గురువారంనాడు మధ్యాహ్నం తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు.   కవిత, రేవంత్ రెడ్డితో పాటు  ఇతరులపై  కూడ  ఫిర్యాదులు అందాయన్నారు. ప్రతి ఫిర్యాదుపై  జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ)ను రిపోర్టు అడిగినట్టుగా  వికాస్ రాజ్ చెప్పారు.  రిపోర్టులో  కోడ్ ఉల్లంఘించారని తేలితే  డీఈఓపై చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో  పోలింగ్ శాతం బాగానే ఉందన్నారు.కొన్ని చోట్ల స్వల్ప ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ఉందని చెప్పారు.

Latest Videos

పట్టణ ప్రాంతాల్లో మందకొడిగా  పోలింగ్ మొదలైందని వికాస్ రాజ్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోనూ పోలింగ్ పుంజుకుంటుందని భావిస్తున్నానని ఆయన  చెప్పారు.  కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలను మార్చిన విషయాన్ని  వికాస్ రాజ్ గుర్తు చేశారు. ఓటరు కార్డే కాదు, ఆధార్, పాన్ వంటి గుర్తింపు కార్డులు చూపి ఓటు వేయవచ్చని కూడ  వికాస్ రాజ్ సూచించారు. 

also read:Telangana Assembly Elections 2023: పెద్ద ఎత్తున బెట్టింగ్, చేతులు మారుతున్న కోట్లు

తెలంగాణ రాష్ట్రంలో  ఇవాళ పోలింగ్ కొనసాగుతుంది.  డిసెంబర్  3వ తేదీన  ఓట్ల లెక్కింపు సాగుతుంది. ఇవాళ సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్  విడుదల కానున్నాయి.  

తెలంగాణలో మూడో దఫా అధికారాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలను ప్రయోగించింది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  ఈ దఫానైనా అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేసింది. దక్షిణాదిలో  తెలంగాణలో  అధికారాన్ని కైవసం చేసుకోవాలని  కమలదళం  వ్యూహంతో ముందుకు వెళ్లింది.  అయితే  ఈ మూడు ప్రధాన పార్టీలలో ఏ పార్టీని ఓటర్లు కరుణిస్తారో  డిసెంబర్ 3న తేలనుంది.

 


 

click me!