బీఆర్ఎస్ అంటే బ్రస్టా చార్ పార్టీ .. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే : యోగి ఆదిత్యనాథ్

By Siva KodatiFirst Published Nov 25, 2023, 6:25 PM IST
Highlights

బీఆర్ఎస్ కాంగ్రెస్‌తో జతకట్టి ప్రజలను మోసం చేయాలని చూస్తోందన్నారు బీజేపీ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. బిఆర్ఎస్ అంటే బ్రస్టా చార్ పార్టీ అని యూపీ సీఎం అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లో ఆరు సంవత్సరాల క్రితం రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఆ తర్వాత యూపీలో డబల్ ఇంజన్ సర్కార్ తో ముందుకు వెళ్తున్నామన్నారు.

బీఆర్ఎస్ కాంగ్రెస్‌తో జతకట్టి ప్రజలను మోసం చేయాలని చూస్తోందన్నారు బీజేపీ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వేములవాడలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. అధికార పార్టీ కుటుంబ పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తూ, ముస్లింలతో జతకట్టి మోసం చేస్తుందన్నారు.  గత 60 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం పేరిట పార్టీలు మోసం చేశాయని .. నీళ్లు, నిధులు , నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశాయని యోగి ఆరోపించారు. బిఆర్ఎస్ అంటే బ్రస్టా చార్ పార్టీ అని యూపీ సీఎం అభివర్ణించారు.

ఉత్తరప్రదేశ్‌లో ఆరు సంవత్సరాల క్రితం రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఆ తర్వాత యూపీలో డబల్ ఇంజన్ సర్కార్ తో ముందుకు వెళ్తున్నామన్నారు. లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని.. డబల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ స్పీడ్ తో వెళ్లే ప్రభుత్వమన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే యోగి మోడీ అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ దేశంలో అందరూ తలెత్తుకునేలా చేసారని.. నయా భారత్ నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకెళ్తున్నానని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 

Latest Videos

Also Read: Yogi Adityanath..రైతులు, పేదల సంక్షేమం కోసం పాటుపడుతాం: కాగజ్ నగర్ సభలో యోగి ఆదిత్యనాథ్

భారతదేశంలో అన్ని రంగాల్లో శరవేగంగా ముందుకెళ్తున్నామని అది నరేంద్ర మోడీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు చేసింది ఏమీ లేదని, బిజెపి రైతులు, సామాన్యుల కోసం ఏర్పాటు చేసిన పార్టీ అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండింటి ఎజెండా ఒక్కటేనని బీఆర్ఎస్‌గా మారి ప్రజలను మోసం చేసిందని యూపీ సీఎం మండిపడ్డారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని యోగి ఆదిత్యనాథ్ దుయ్యబట్టారు. వచ్చే జనవరిలో అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు వేములవాడలో పోటీ చేస్తున్నారని ఆయనను గెలిపించాలని యోగి విజ్ఞప్తి చేశారు. 
 

click me!