మంచిర్యాలలో ఇద్దరు వ్యక్తులు మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు. అక్రమంగా బెల్ట్ షాపు, అనధికార వైన్స్ ఔట్‌లెట్ నిర్వహించడానికి ఆ మందును తీసుకెళ్లుతున్నట్టు వారు అంగీకరించారు. బెల్లంపల్లిలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఈ లిక్కర్ పట్టుబడింది.
హైదరాబాద్: ఎన్నికల వేళ ప్రచారాల పర్వం, ప్రలోభాల పర్వం సాధారణమైపోతున్నాయి. ఎలక్షన్ సీజన్‌లో మద్యం అమ్మకాలు సాధారణ రోజుల్లో కంటే పలురెట్లు అధికంగా అమ్ముడవుతుంటాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే బెల్ట్ షాపులను మూసేయాలని ఆదేశాలు వచ్చిన సంగతి తెలిసిందే. మద్యం ప్రియులు వైన్స్‌లకు వెళ్లి కొనుక్కున్నారు. అలాగే పార్టీల ప్రచార కార్యక్రమాల్లో మద్యం పంపకాలు సాధారణమైపోయాయి. 48 గంటల సైలెంట్ పీరియడ్‌లో లిక్కర్ మరెక్కడా దొరకదు. వైన్స్‌లు కూడా బంద్ చేస్తారన్న సంగతి తెలిసిందే. మొత్తంగా ఎన్నికల సీజన్‌లో మందుకు బాగా గిరాకీ. దీన్ని క్యాష్ చేసుకోవడానికి బెల్టు షాపుల నిర్వాహకులు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. గుట్టుగా లిక్కర్ అమ్ముతుంటారు. ఇలా గుట్టుగా లిక్కర్ అమ్మడానికి బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఇద్దరు మద్యం తీసుకుని వెళ్లుతుండగా మంచిర్యాలలో పోలీసులకు పట్టుబడ్డారు.
ఇద్దరు వ్యక్తులు మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ బెల్లంపల్లిలో సోమవారం రాత్రి పట్టుబడ్డారు. సీజ్ చేసిన ఆ లిక్కర్ విలువ సుమారు రూ. 56 వేలుగా ఉన్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. సొగల్ రాజేశం, కండి మల్లేశ్‌లు ఇద్దరూ ఈ లిక్కర బాటిళ్లతో పట్టుబడినట్టు బెల్లంపల్లి ఇన్‌స్పెక్టర్ బన్సిలాల్ చెప్పారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరు పట్టుబడ్డారని పేర్కొన్నారు.
undefined
వారు స్వస్థలం రామ్‌నగర్‌లో బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్టు వారిద్దరూ అంగీకరించినట్టు పోలీసులు చెప్పారు. వీరిపై కేసు నమోదైంది. దర్యాప్తు మొదలైంది.