తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తి కాగానే సిరిసిల్లలో కేటీఆర్ 265 ఓట్లతో వెనుకంజలో ఉండటం బీఆర్ఎస్ కార్యకర్తలకు షాకిచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కొండం కరుణ మహేందర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు జరుగుతోంది. అన్ని నియోజకవర్గాల్లో మొదటి రౌండ్ పూర్తయ్యింది. అయితే, మొదటి రౌండ్ పూర్తయ్యే సమయానికి ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ మెజార్టీల్లో ఉంది. అయితే, రౌండ్లు పెరిగే కొద్దీ ఫలితాలు మారే అవకాశం కూడా లేకపోలేదు. అయితే, ఇప్పటి వరకు వస్తున్న ఫలితాలను చూసి కాంగ్రెస్ నేతల్లో హుషారు పెరుగుతుంటే, బీఆర్ఎస్ నేతల్లో కంగారు మొదలైంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అగ్ర నేతలు కూడా వెనకంజలో ఉండటంతో మరింత కంగారు ఎక్కువయ్యింది. కేటీఆర్ కూడా తన సొంత నియోజకవర్గంలో వెనకపడిపోతుండటం గమనార్హం.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడైన కేటీఆర్ పార్టీలోని ప్రజాకర్షక నేతల్లో ఒకరు. అయితే ఆయన తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల నుంచి ఊహించని షాక్ ఎదురైంది. ఆయన ప్రస్తుతం వెనకంజలో పడిపోయారు. తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తి కాగానే సిరిసిల్లలో కేటీఆర్ 265 ఓట్లతో వెనుకంజలో ఉండటం బీఆర్ఎస్ కార్యకర్తలకు షాకిచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కొండం కరుణ మహేందర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
undefined
కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేస్తూ తన పార్టీ అభ్యర్థుల కోసం ముమ్మరంగా ప్రచారం చేశారు. సిరిసిల్ల తనకు ఖచ్ఛితమైన సీటు అని కేటీఆర్ భావించారు, అయితే మొదటి రౌండ్ ఫలితం కేటీఆర్ కి అనుకూలంగా లేకపోవడం గమనార్హం. అయితే కేటీఆర్‌కు అదృష్టవశాత్తూ రెండో రౌండ్‌లో వేగం పుంజుకుని ఇప్పుడు కాస్త ఆధిక్యం సాధించగలిగారు. సిరిసిల్ల నుండి బీఆర్‌ఎస్‌కు ఊపిరి పోసిన తొలి సెట్ బ్యాక్ నుంచి అతను కోలుకున్నాడు.
ఇక కేసీఆర్ విషయానికొస్తే.. గజ్వేల్‌లో ఆయన ఆధిక్యంలో ఉండగా, మూడు రౌండ్ల కౌంటింగ్ తర్వాత కామారెడ్డిలో వెనుకంజలో కొనసాగుతున్నారు. మరో బీఆర్‌ఎస్ అగ్రనేత హరీశ్‌రావు సిద్దిపేట నుంచి ఆధిక్యంలో ఉన్నారు.
ఏడవ రౌండ్ ముగిసేసరికి
బిఆర్ఎస్:26648
బిఎస్పీ :3394
కాంగ్రెస్: 18687
బిజెపి:6286
7961 బిఆర్ఎస్ లీడ్