ధర్మమే గెలుస్తుంది: తుమ్మల ఫిర్యాదుపై పువ్వాడ అజయ్

By narsimha lodeFirst Published Nov 13, 2023, 7:03 PM IST
Highlights

నామినేషన్ల పరిశీలన సందర్భంగా  బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  ఇదే పరిస్థితి నెలకొంది. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో  పువ్వాడ అజయ్ కుమార్ నామినేషన్ పై తుమ్మల నాగేశ్వరరావు  ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. 

ఖమ్మం: తన నామినేషన్ పై ఎన్నికల అధికారికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేవనెత్తిన అభ్యంతరాలను  ఎన్నికల అధికారులు తిరస్కరించారని తెలంగాణ మంత్రి,ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగిన బీఆర్ఎస్ అభ్యర్ధి  పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.

ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి  భారత రాష్ట్ర సమితి అభ్యర్ధిగా  పువ్వాడ అజయ్ కుమార్  బరిలోకి దిగారు. ఇదే అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. 

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పరిశీలన సాగుతుంది.దీంతో  ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగిన భారత రాష్ట్ర సమితి అభ్యర్ధి  పువ్వాడ అజయ్ నామినేషన్ పై  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సోమవారంనాడు ఫిర్యాదు చేశారు.పువ్వాడ అజయ్ కుమార్ నామినేషన్ సరైన ఫార్మెట్ లో లేదని ఆయన  ఆరోపించారు.  సరైన ఫార్మెట్ లో లేని నామినేషన్ ను తిరస్కరించాలని ఆయన కోరారు.

అయితే  తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలపై  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. తన నామినేషన్ పై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లేఖ ఇచ్చారని ఆయన  పేర్కొన్నారు.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  లేవనెత్తిన అభ్యంతరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారన్నారు. ఈ విషయమై  తుమ్మల నాగేశ్వరరావుకు  అభ్యంతరాలుంటే కోర్టుకు వెళ్లొచ్చని  ఆయన  సూచించారు.మీరు ఎక్కడికి వెళ్లినా ధర్మమే గెలుస్తుందని తుమ్మల నాగేశ్వరరావుకు  పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  2009 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా  తుమ్మల నాగేశ్వరరావు  పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మరోసారి ఇదే అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీ య పరిణామాల నేపథ్యంలో  తుమ్మల నాగేశ్వరరావు టీడీపీని వీడి  బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ కేబినెట్ లో తుమ్మల నాగేశ్వరరావుకు చోటు దక్కింది.  పాలేరు నుండి ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక జరిగింది.

also read:మంత్రి పువ్వాడపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాను.. తుమ్మల నాగేశ్వరరావు

ఈ ఉప ఎన్నికల్లో  తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుండి బరిలోకి దిగారు.ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్ధి మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణిపై  తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు.  2018 ఎన్నికల్లో పాలేరు నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి  కాంగ్రెస్ అభ్యర్ధి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు.  ఈ ఎన్నికల్లో కందాల ఉపేందర్ రెడ్డికే బీఆర్ఎస్ నాయకత్వం టిక్కెట్టు కేటాయించింది. దీంతో అసంతృప్తికి గురైన  తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు.

click me!