ఈ నెల 17న తెలంగాణకు అమిత్ షా: బీజేపీ మేనిఫెస్టో విడుదల, నాలుగు సభల్లో పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి

By narsimha lode  |  First Published Nov 13, 2023, 4:00 PM IST

తెలంగాణ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ ను మరింతగా పెంచింది.  కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రంలో  సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.  ఒకే రోజున  నాలుగు ఎన్నికల సభల్లో పాల్గొనేలా కమలదళం ప్లాన్ చేసింది.



హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల  17న తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అదే రోజున  బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. హైద్రాబాద్ సోమాజీగూడలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను  ఆ పార్టీ విడుదల చేయనుంది.మేనిఫెస్టో విడుదల తర్వాత  రాష్ట్రంలోని నాలుగు ఎన్నికల సభల్లో  అమిత్ షా పాల్గొంటారు.

నల్గొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్ లలో నిర్వహించే ఎన్నికల సభల్లో  అమిత్ షా పాల్గొంటారు.ఈ నెల 25 నుండి మూడు రోజుల పాటు  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడ రాష్ట్రంలో పర్యటించనున్నారు.  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్వహించే ఎన్నికల సభల్లో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు.  ఈ నెల  25న  కరీంనగర్ లో, ఈ నెల  26న  నిర్మల్ లో  జరిగే ఎన్నికల సభల్లో  ప్రధానమంత్రి మోడీ పాల్గొంటారు.

Latest Videos

undefined

 ఈ నెల  27న  ప్రధానమంత్రి హైద్రాబాద్ నగరంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ  రోడ్ షో ను  బీజేపీ నాయకత్వం ప్లాన్ చేసింది.ఈ నెల  27న హైద్రాబాద్ ఎల్ బీ నగర్ నుండి  పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గం వరకు  సుమారు  50 కి.మీ. దూరం రోడ్ షో ను మోడీతో చేయించాలని  కమలదళం ప్లాన్ చేసింది.

ఈ నెల 7, 11 తేదీల్లో నిర్వహించిన  ఎన్నికల సభల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. గత నెలలో కూడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  పర్యటన తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా  కూడ  తెలంగాణలో  పలు చోట్ల ఎన్నికల సభల్లో పాల్గొన్నారు.మరోసారి అమిత్ షా తెలంగాణకు రానున్నారు.

తెలంగాణ రాష్ట్రంపై  బీజేపీ నాయకత్వం ఫోకస్ ను మరింత పెంచింది.  గత కొంత కాలంగా  సునీల్ భన్సల్ నేతృత్వంలోని  ఆ పార్టీ నేతలు క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడంపై కేంద్రీకరించాయి. 

తెలంగాణలో  ఈ దఫా అధికారాన్ని దక్కించుకోవాలని కమలదళం వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది.  మరో వైపు  కాంగ్రెస్ పార్టీ కూడ ఈ ఎన్నికల్లో  తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది.


 

click me!