Barrelakka‌ కు భద్రత కల్పించాలి: తెలంగాణ హైకోర్టు ఆదేశం

By narsimha lode  |  First Published Nov 24, 2023, 3:59 PM IST

భద్రత కల్పించాలని కోరుతూ కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న బర్రెలక్క అలియాస్ శిరీష తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఈ  పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది. 



హైదరాబాద్: కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన  ఇండిపెండెంట్ అభ్యర్ధి బర్రెలక్క అలియాస్ శిరీషకు  భద్రత కల్పించాలని  తెలంగాణ హైకోర్టు శుక్రవారంనాడు ఆదేశించింది. ఎన్నికలయ్యే వరకు  భద్రత కల్పించాలని ఈసీని ఆదేశించింది. అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్ దేనని తెలంగాణ హైకోర్టు అభిప్రాయ పడింది.   బర్రెలక్క నిర్వహించే పబ్లిక్ మీటింగ్ లకు భద్రత కల్పించాలని ఆదేశించింది.  గుర్తింపు ఉన్న పార్టీలకే  కాదు  అవసరమైన  అభ్యర్ధులకు  భద్రత కల్పించాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆమెపై కొందరు దాడి చేశారు.ఈ దాడి నుండి ఆమె తప్పించుకుంది. అయితే ఈ దాడిలో ఆమె సోదరుడు గాయపడ్డారు. దీంతో  తనకు రక్షణ కల్పించాలని కోరుతూ  బర్రెలక్క తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.  ఇవాళ మధ్యాహ్నం ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ నిర్వహించింది.  బర్రెలక్కకు భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Latest Videos

undefined

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని  బర్రెలక్క అలియాస్ శిరీష  సోషల్ మీడియాలో  వీడియోలు  వైరల్ గా మారాయి.  తనకు తన తల్లి బర్రెలు కొనిస్తే వాటిని మేపుతున్నానని  శిరీష సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో  వైరల్ గా మారింది.అప్పటి నుండి శిరిష అలియాస్ బర్రెలక్కగా మారింది. 

బర్రెలక్క  ఎన్నికల ప్రచారంపై  దాడి నేపథ్యంలో  పలు పార్టీలు, ప్రజా సంఘాలు ఈ దాడిని ఖండించాయి.ఈ దాడి నేపథ్యంలో రక్షణ కోరుతూ బర్రెలక్క  హైకోర్టును ఆశ్రయించింది. బర్రెలక్కకు  భద్రత కల్పించాలని ఈసీ ఆదేశించింది. 

కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుండి గతంలో  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహించారు.  ఈ దపా కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే  బీరం హర్షవర్ధన్ రెడ్డి  బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బర్రెలక్కకు  పుదుచ్ఛేరి మాజీ ఎమ్మెల్యే  మల్లాడి కృష్ణారావు లక్ష రూపాయాలు విరాళంగా పంపారు.

click me!